ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

లోక్‌సభ ఎన్నికలకు సహకరించాలి

ABN, Publish Date - Apr 27 , 2024 | 12:26 AM

లోక్‌సభ ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు తగిన కార్యాచరణతో ముందుకుపోతున్నామని, రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ సహాయ ఎన్నికల అధికారి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో కె.అనంతరెడ్డి అన్నారు.

ఎన్నికల అధికారి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్‌ 26 : లోక్‌సభ ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు తగిన కార్యాచరణతో ముందుకుపోతున్నామని, రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ సహాయ ఎన్నికల అధికారి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో కె.అనంతరెడ్డి అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం 343 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, 107 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. ఓటరు స్లిఫ్పుల పంపిణీ మొదలైందని, మే 8 వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఇప్పటివరకు రూ.90.84 లక్షల నగదు, రూ.1.28 లక్షల విలువచేసే ఆభరణాలు, రూ.9.68 లక్షల విలువచేసే మద్యం, 668.39 కిలోల నిషేదిత పదార్థాలను స్వాధీనం చేసుకొని సీజ్‌ చేసినట్లు తెలిపారు.

పోలింగ్‌ కేంద్రాల్లో వసతులు కల్పించాలి

కందుకూరు : పోలింగ్‌ కేంద్రాల్లో వసతులు కల్పించాలని, ఇబ్బందులు రాకుండా సంబంధిత సిబ్బందితో సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆర్డీవో, ఎన్నికల సహాయ రిటర్నింగ్‌ అధికారి సూరజ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో సెక్టర్‌ అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో 537 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేయగా, 48మంది సెక్టోరియల్‌ అఽధికారులను నియమించడం జరిగిందన్నారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఓటరు స్లిప్పులను బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లతో పంపిణీ చేయాలన్నారు. ఎన్నికల డిప్యూటీ తహసీల్ధార్‌ శేఖర్‌, కందుకూరు, మహేశ్వరం, బాలాపురం, మండలాల తహసీల్ధార్లు కె.గోపాల్‌, పి.విజయలక్ష్మి, కె.మాధవిరెడ్డి, అఽధికారులు పాల్గొన్నారు.

ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలి

కేశంపేట : లోక్‌సభ ఎన్నికల నేపఽథ్యంలో ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని షాద్‌నగర్‌ ఆర్డీవో వెంకట మాధవరావు సూచించారు. కేశంపేట మండల పరిధిలోని కొనాయపల్లి గ్రామ సమీపంలోని చెక్‌పోస్టును శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనాలను తనిఖీ చేసే సమయంలో వీడియో చిత్రీకరణ చేపట్టాలని, తనిఖీ సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ఓటరు స్లిప్పుల పంపిణీ

మండలంలో ఓటరు స్లిప్పుల పంపిణీని అధికారులు ప్రారంభించారు. వివిధ గ్రామాల్లో బీఎల్‌వోలు ఓటర్లకు స్లిప్పులను అందిస్తున్నారు. కొత్తపేటలో ఓటరు స్లిప్పుల పంపిణీని ఆర్డీవో వెంకట మాధవరావు పరిశీలించి, ఓటర్లకు స్లిప్పులను అందించారు. ప్రతీఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవానలి ఆయన సూచించారు. తహసీల్దార్‌ మీర్‌ ఆజంఅలీ, ఆర్‌ఐ నివేదిత పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:26 AM

Advertising
Advertising