ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎస్సీ వర్గీకరణ తీర్పుపై సర్వత్రా హర్షం

ABN, Publish Date - Aug 02 , 2024 | 12:31 AM

ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో గురువారం ఎమ్మార్పీఎస్‌ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ళ నర్సింహ మాదిగ ఆధ్వర్యంలో షాద్‌నగర్‌ చౌరస్తా లోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి, బాణ సంచాలను కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు.

తలకొండపల్లి : మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో సంబురాలు

ప్రధాని మోదీ, మంద కృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం

షాద్‌నగర్‌ అర్బన్‌, ఆగస్టు 1: ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో గురువారం ఎమ్మార్పీఎస్‌ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ళ నర్సింహ మాదిగ ఆధ్వర్యంలో షాద్‌నగర్‌ చౌరస్తా లోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి, బాణ సంచాలను కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు. నాయకులు రవికుమార్‌, ఆనంద్‌, తదితరులు పాల్గొన్నారు.

తలకొండపల్లి : మండలం కేంద్రంలో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచారు. పోతుగంటి కృష్ణమాదిగ, లలితజ్యోతయ్య, రామచంద్రయ్య, కిరణ్‌మాదిగ, తదితరులున్నారు.

యాచారం : ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 ఏళ్లుగా తాము చేస్తున్న పోరాటాన్ని సుప్రీం కోర్టు గుర్తించి ఎస్సీ వర్గీకరణ చేయాలని రాష్ట్రాలను సుప్రీం కోర్టు ఆదేశించడం సంతోషదాయకమని యాచారం మండల ఎమ్మార్పీఎస్‌ నాయకులు బోడకృష్ణ, లింగం తదితరులు అన్నారు. మాల్‌లో సాగర్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై అంబేడ్కర్‌ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండల కేంద్రంలో బీజేపీ సీనియర్‌ నాయకులు మేకల యాదగిరిరెడ్డి, మండల అధ్యక్షుడు తాండ్రరవీందర్‌ల ఆధ్వర్యంలో ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నందివనపర్తి మాజీ సర్పంచ్‌ విజయ్‌కుమార్‌, నాయకులు గొల్లపల్లి జంగయ్యగౌడ్‌, తదితరులున్నారు.

కేశంపేట : కేంద్ర ప్రభుత్వ చొరవతోనే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించిందని, ఇది మాదిగల ఉపకులాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని బీజేపీ మండలాధ్యక్షుడు రఘురాములు గౌడ్‌, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు శివాజీ, పోమాల్‌పల్లి మహే్‌షలు ఓ ప్రకటనలో తెలిపారు.

షాద్‌నగర్‌ అర్బన్‌ : ప్రధాని ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య పేర్కొన్నారు. మంద కృష్ణమాదిగ డిమాండ్‌ మేరకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించడంతోనే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని తెలిపారు. మోదీకి బాబయ్యతో పాటు బీజేపీ ఎస్సీమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటే్‌షలు కృతజ్ఞతలు తెలిపారు.

మొయినాబాద్‌ : ఎస్సీ వర్గీకరణ బాద్యతలను రాష్ర్టాలకు అప్పగిస్తూ సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మసనం తీర్పు నివ్వడం హర్షించదగ్గ విషయమని పీసీసీ సభ్యుడు షాబాద్‌ దర్శన్‌ అన్నారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ ఎంతో మంది అమరులైనారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలు చేస్తుందన్నారు.

చేవెళ్ల : సుప్రీకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఆలూర్‌లో ఎమ్మార్పీఎస్‌ నాయకులు, పార్టీల నాయకులు అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. వెంకటేశ, తోట చంద్రశేఖర్‌, ఆశోక్‌, శంకరయ్య, నర్సింలు, రమేశ్‌, యాదయ్య, జంగయ్య, తదితరులున్నారు. కాగా, ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, చేవెళ్ల మాజీ ఉపసర్పంచ్‌ గంగి యాదయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు రామస్వామి, ఎమ్మార్పీఎస్‌ జిల్లా కార్యదర్శి శివశంకర్‌ అన్నారు. పట్టణ కేంద్రంలో యాదయ్య సమక్షంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు సత్యనారాయణ, పెంటయ్య, వెంకటయ్య, ప్రవీణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

శంషాబాద్‌ : మున్సిపల్‌ కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటం ఏర్పాటుచేసి పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంచిపెట్టి బాణసంచా కాల్చి పెద్దఎత్తున సంబరాలు జరుపుకున్నారు. నాయకులు మదిలేటి మాదిగ, నర్సింహ మాదిగలు మున్సిపాలిటీ, మండల ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

కందుకూరు : ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు కంద పెద్ద నర్సింహ ఆధ్వర్యంలో నాయకులు మండ ల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వే సి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆ సంఘం నా యకులు కె.జంగయ్య, కె.నర్సింహ, కె.రవి, నవీన్‌కుమార్‌, కె.అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2024 | 12:31 AM

Advertising
Advertising
<