ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పొదల్లోకి దూసికెళ్లిన స్కూలు బస్సు

ABN, Publish Date - Aug 21 , 2024 | 12:16 AM

ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా బస్సు పొదల్లోకి దూసుకెళ్లింది.

ప్రమాదానికి గురైన పాఠశాల బస్సు

విద్యార్థులకు త్రుటిలో తప్పిన ముప్పు

మొయినాబాద్‌ రూరల్‌, ఆగస్టు 20: ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా బస్సు పొదల్లోకి దూసుకెళ్లింది. బస్సు నిలిచిపోవడం తో విద్యార్థులకు త్రుటిలో అపాయం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరులోని శ్రీ శివ సాయి ఇంటర్‌నేషనల్‌ స్కూల్‌ బస్సు మంగళవారం ఉదయం మోత్కుపల్లిలో విద్యార్థులను ఎక్కించుకొని పాఠశాలకు బయల్దేరింది. డ్రైవర్‌ సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ బస్సును నడపడంతో మోత్కుపల్లి దాటగానే అదుపుతప్పి రోడ్డు పక్క నున్న పొదల్లోకి దూసికెళ్లింది. బస్సు చెట్టును ఢీకొని నిలిచింది. అదృష్టవశాత్తు విద్యార్థులకు ఏమీ కాలేదు. సమాచారం అందుకున్న పాఠశాల యజమాన్యం ఇతర వాహనాల్లో విద్యార్థులను స్కూలుకు తరలించింది. డ్రైవర్‌ సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ నడిపినందుకే ప్రమాదం జరిగిందని విద్యార్థులు తెలిపారు. ఇలాంటి డ్రైవర్లను విధుల్లో పెట్టుకోవద్దని తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని కోరారు. అదృష్టం కొద్దీ ఎవరికీ ఏమీ కాలేదని అన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 12:16 AM

Advertising
Advertising
<