ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అడవుల అభివృద్ధిలో బీట్‌ ఆఫీసర్ల పాత్ర కీలకం

ABN, Publish Date - Aug 24 , 2024 | 11:42 PM

అడవుల అభివృద్ధిలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్ల పాత్ర కీలకమని జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్‌ అన్నారు.

అనంతగిరికి శిక్షణలో భాగంగా వచ్చిన బీట్‌ ఆఫీసర్లు

  • జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్‌

వికారాబాద్‌, ఆగస్టు 24: అడవుల అభివృద్ధిలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్ల పాత్ర కీలకమని జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్‌ అన్నారు. తెలంగాణ ఫారెస్ట్‌ అకాడమిలో శిక్షణ పొందుతున్న 33 మంది బీట్‌ ఆఫీసర్లు శనివారం శిక్షణలో భాగంగా అనంతగిరిని సందర్శించారు. అనంతగిరి రిజర్వ్‌ ఫారె్‌స్టలో అభివృద్ధి చెందుతున్న టూరిజం పార్కింగ్‌, ట్రెకింగ్‌ ఏరియా, వాచ్‌ టవర్‌, గ్రాస్‌ ల్యాండ్‌ ఏరియా వంటి ప్రాంతాలను స్టడీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీట్‌ ఆఫీసర్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నారు. వృత్తి జీవితంలో ఉన్న ఒత్తిళ్లను అధిగమించడానికి సమాజంలోని వ్యక్తులతో, సహచరులతో, ఇతర అధికారులతో ఆరోగ్యకరమైన సంబంధాలు నెలకొల్పుకోవాలని సూచించారు. అడవుల ప్రత్యేకతను బీట్‌ ఆఫీసర్‌ గుర్తించి, వాటిని సంరక్షించాలన్నారు. ప్రస్తుతం దేశంలో జనాభా పెరుగుదలతో ఫారెస్ట్‌ భూములపై తీవ్రమైన ఒత్తిడి ఉందని దీనిని దృష్టిలో ఉంచుకొని తమ విధులను నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్యామ్‌ కుమార్‌, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ అరుణ, తెలంగాణ ఫారెస్ట్‌ అకాడమి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుభాష్‌ చంద్ర యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:42 PM

Advertising
Advertising
<