మహిళా సంఘాల పనితీరు భేష్
ABN, Publish Date - Jun 06 , 2024 | 11:51 PM
మహేశ్వరంలో మహిళా సంఘాల పనితీరు బాగుందని, దీని ద్వారా మహిళలు మరింత ఆర్థికాభివృద్ధి చెందుతున్నారని జాతీయ గ్రామీణాభివృద్ధి శిక్షణా కేంద్రం (ఎన్‌ఐఆర్డీ) బృందం మేనేజర్ కితాబిచ్చారు. ఈమేరకు గురువారం మహేశ్వరం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కేంద్రాన్ని ఆయన ఆధ్వర్యంలో ఎన్‌ఐఆర్డీ బృందం సందర్శించింది.
జాతీయ గ్రామీణాభివృద్ధి శిక్షణా కేంద్రం మేనేజర్ అభిషేక్
మహేశ్వరం, జూన్ 6 : మహేశ్వరంలో మహిళా సంఘాల పనితీరు బాగుందని, దీని ద్వారా మహిళలు మరింత ఆర్థికాభివృద్ధి చెందుతున్నారని జాతీయ గ్రామీణాభివృద్ధి శిక్షణా కేంద్రం (ఎన్‌ఐఆర్డీ) బృందం మేనేజర్ కితాబిచ్చారు. ఈమేరకు గురువారం మహేశ్వరం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కేంద్రాన్ని ఆయన ఆధ్వర్యంలో ఎన్‌ఐఆర్డీ బృందం సందర్శించింది. పంజాబ్, జార్ఖండ్, ఫుదుచ్చేరి, కర్ణాటక, చత్తీ్‌సఘడ్, బిహార్ రాష్ర్టాలకు చెందిన గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతినిధుల బృందం పాల్గొని మహిళా సంఘాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేనేజర్ అభిషేక్ మాట్లాడుతూ మహిళలు స్వయం సంఘాల ద్వారా వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని జీవనోపాధితో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందడం ఎంతో అభినందనీయమన్నారు. ఇలాంటి మహిళా సంఘాల పనితీరును దేశంలోని వివిధ రాష్ర్టాల్లో ప్రచారం చేసి మహిళలను చైతన్యం చేసేందుకు కృషి చేస్తామన్నారు. మహిళా సంఘాలకు ఇక్కడి ప్రభుత్వం కూడా అన్నివిధాలుగా సహకరించడం వంటి ప్రోత్సాహకాలు బాగున్నాయన్నారు. ఇలాంటి సదవకాశాలను మహిళలు వినియోగించుకొని మరింత అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శైలజారెడ్డి, ఏపీఎం సత్యనారాయణ, మండలంలోని వివిధ గ్రామాల మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 06 , 2024 | 11:51 PM