ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంపులో పడి బాలుడి మృతి

ABN, Publish Date - Sep 10 , 2024 | 11:35 PM

నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన తలకొండపల్లి మండలం చౌదర్‌పల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్‌ కథనం ప్రకారం..

ఆమనగల్లు, సెప్టెంబరు 10: నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన తలకొండపల్లి మండలం చౌదర్‌పల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్‌ కథనం ప్రకారం.. చౌదర్‌పల్లికి చెందిన దుడ్డు శేఖర్‌ కుమారుడు అభిరామ్‌(2) సోదరితో కలిసి సోమవారం సాయంత్రం ఇంటిబయట ఆడుకుంటున్నాడు. అభిరామ్‌ తలి,్ల సోదరుడు ఇంట్లో ఉన్నారు. కొంతసేపటి తర్వాత బయట ఆడుకుంటున్న కూతురు ఏడ్చుకుంటూ ఇంట్లోకి వచ్చింది. అభిరామ్‌ రాకపోవడం, చుట్టుపక్కల వెతికినా కన్పించకపోవడంతో అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు ఇంటి ముందు సంపు వద్దకు వెళ్లి చూడగా కన్పించాడు. అపస్మారక స్థితిలో ఉన్న అభిరామ్‌ను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్‌లోని హస్తినాపూర్‌లో గల ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి, ఆ తర్వాత నిలోఫర్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున బాలుడు మృతిచెందాడు. బాలుడి తండ్రి శేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - Sep 10 , 2024 | 11:35 PM

Advertising
Advertising