ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మత్తుపదార్థాల తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

ABN, Publish Date - Aug 24 , 2024 | 11:25 PM

మేడ్చల్‌ జిల్లా కాచవానిసంగారంలో గుట్టుచప్పుడు కాకుండా అల్ర్పాజోలం (మత్తుపదార్థాలు) తయారు చేస్తున్న కేంద్రం పై రాష్ట్ర ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి రూ. 30 లక్షల విలువైన ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు వెల్లడిస్తున్న వీబీ కమలాసన్‌రెడ్డి

  • రూ.30లక్షల విలువైన ముడిసరుకు స్వాధీనం

  • పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఆగస్టు 24: మేడ్చల్‌ జిల్లా కాచవానిసంగారంలో గుట్టుచప్పుడు కాకుండా అల్ర్పాజోలం (మత్తుపదార్థాలు) తయారు చేస్తున్న కేంద్రం పై రాష్ట్ర ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి రూ. 30 లక్షల విలువైన ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేటకు చెందిన మీనా శ్రీనివాస్‌ (49), పోలీశెట్టిరాంబాబు (47), గాజులరామారానికి చెందిన తాడి లక్ష్మయ్య (50), వనస్థలిపురానికి చెందిన కాకర్ల చంద్రశేఖర్‌ (48) మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం కాచవానిసంగారంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. పలు ఫార్మా కంపెనీల్లో పని చేసిన మీనా శ్రీనివాస్‌, పోడిశెట్టి రాంబాబు డబ్బులు సంపాదించాలనే అత్యాశతో లక్షలు వెచ్చించి అల్ర్పాజోలం తయారు చేసే ఫార్ములాను ఓ కెమికల్స్‌ సంస్థ యజమాని నుంచి కొనుగోలు చేశారు. అనంతరం దానికి వినియోగించే ముడిపదార్థాలను పలు దుకాణాల్లో కోనుగోలు చేసి అల్ర్పాజోలం తయారీ మొదలు పెట్టారు. విశ్వసనీయ సమాచారంతో రాష్ట్ర ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఈ కేంద్రంపై దాడి చేసి 2 కిలోల 91 గ్రాముల అల్ర్పాజోలం, రూ. 30 లక్షల విలువైన ముడిసరుకును స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Aug 24 , 2024 | 11:25 PM

Advertising
Advertising
<