ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి గురికావద్దు

ABN, Publish Date - Apr 25 , 2024 | 12:33 AM

పరీక్ష ఫలితాల సమయంలో విద్యార్థులు భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఒత్తిడికి గురికావద్దని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి పాల్వన్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులు కాలేకపోతే ఒత్తిడి, అభద్రతకు గురికావద్దని, ఆత్మహత్యలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని, సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావొచ్చని తెలిపారు. ఎంతో మంది మేధావులు, ప్రాథమిక స్థాయిలో ఫెయిలైనా అధైౖర్య పడకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు.

జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి పాల్వన్‌కుమార్‌

వికారాబాద్‌, ఏప్రిల్‌ 24 : పరీక్ష ఫలితాల సమయంలో విద్యార్థులు భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఒత్తిడికి గురికావద్దని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి పాల్వన్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులు కాలేకపోతే ఒత్తిడి, అభద్రతకు గురికావద్దని, ఆత్మహత్యలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని, సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావొచ్చని తెలిపారు. ఎంతో మంది మేధావులు, ప్రాథమిక స్థాయిలో ఫెయిలైనా అధైౖర్య పడకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు. జీవితం చాలా విలువైందని, మీపై ఎన్నో ఆశలతో కంటికి రెప్పలా చూసుకునే తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చకూడదని, జీవితం అంటే పరీక్షలు మాత్రమే కాదని, జీవితంలో పాస్‌ కావడం ముఖ్యమని తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురైతే.. జిల్లాలో జిల్లా మానసిక ఆరోగ్య కేంద్రం టోల్‌ఫ్రీ నెంబర్‌ 14416ను సంప్రదించి ప్రత్యేక వైద్య నిపుణులు, కౌన్సెలర్‌తో మాట్లాడాలని సూచించారు. తల్లిదండ్రులు విద్యార్థుల పరీక్ష మార్కులను కొలమానంగా మాత్రమే చూడవద్దని, ఎన్నో రంగాల్లో అవకాశాలు ఉంటాయని, ఇతర విద్యార్థులతో పోల్చవద్దని తెలిపారు. ఒకవేళ మీ పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు గుర్తిస్తే టోల్‌ఫ్రీ నెంబర్‌ 14416కు ఫోన్‌చేసి కౌన్సెలింగ్‌ ఇప్పించాలని తెలిపారు. మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండాలంటే సరైన నిద్ర, మంచి ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం, ఫోన్‌ వాడకం తగ్గించడం, స్నేహితులతో గడపడం వంటివి చేయాలన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:33 AM

Advertising
Advertising