ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు

ABN, Publish Date - Jun 07 , 2024 | 11:40 PM

నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మినా.. లూజుగా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేదని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ గీతారెడ్డి చెప్పారు.

యాచారంలో దుకాణం తనిఖీ చేస్తున్న గీతారెడ్డి

జిల్లాలో ఎరువులు విత్తనాల కొరత లేదు

వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ గీతా రెడ్డి

యాచారం, జూన్‌ 7 : నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మినా.. లూజుగా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేదని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ గీతారెడ్డి చెప్పారు. శుక్రవారం ఆమె యాచారం మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఎ రువులు విత్తనాలు లూజుగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. విత్తనాలు కొన్న రైతులు రసీదులు తీసుకోవాలని, వాటిని పంట చేతికందే వరకు భద్రపరచుకోవాలని సూచించారు. వ్యవసాయశాఖ అనుమతి లేకుండా ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎ రువులను కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాలం చెల్లిన విత్తనాలు అమ్మరాదని కోరారు. పదిమందికి అన్నం పెడుతున్న రైతుకు అన్యాయం చేయరాదని వ్యాపారులకు సూచించారు. ఖరీఫ్‌ సీజన్‌ ముగిసేదాకా ప్రతీ మండలంలోని ఎ రువులు, విత్తనాల దుకాణాలను వ్యవసాయాధికారులు తనిఖీ చేయాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు.

Updated Date - Jun 07 , 2024 | 11:40 PM

Advertising
Advertising