ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సంతృప్తికరంగా ఉపాధి పనులు

ABN, Publish Date - May 17 , 2024 | 12:48 AM

జిల్లాలో ఉపాధి పనులు బాగా జరుగుతున్నాయని, సరిహద్దు కందకాల తవ్వకం పనులు నాణ్యతతో చేయిస్తున్నామని జిల్లా డీఆర్‌డీఏ పీడీ శ్రీలత పేర్కొన్నారు.

చింతపట్లలో కూలీలు పనిచేస్తున్న చోట పరిశీలిస్తున్న డీఆర్‌డీఏ పీడీ శ్రీలత

కూలీలకు వారవారం వేతనాలందిస్తున్నాం

ఉపాధి కల్పించడం లేదనే భావన కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం : డీఆర్‌డీఏ పీడీ శ్రీలత

యాచారం, మే 16 : జిల్లాలో ఉపాధి పనులు బాగా జరుగుతున్నాయని, సరిహద్దు కందకాల తవ్వకం పనులు నాణ్యతతో చేయిస్తున్నామని జిల్లా డీఆర్‌డీఏ పీడీ శ్రీలత పేర్కొన్నారు. వారం వారం కూలీల ఖాతాల్లో వేతనాలు జమ చేయిస్తున్నట్లు ఆమె చెప్పారు. హరితహారం నర్సరీల్లో మొక్కల సంరక్షణపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం యాచారం మండలం చింతపట్ల, యాచారం, మొండిగౌరెల్లి గ్రామాల్లో ఆమె పర్యటించి కూలీల సమస్యలను తెలుసుకున్నారు. వానాకాలంలో పొలాల్లోని వరద నీరు వృథాగా పోకుండా ఎక్కడికక్కడ కమతాల సరిహద్దుల్లో కందకాలను తవ్వాలని కూలీలను ఆదేశించారు. పనులు నాణ్యతగా చేయాలన్నా రు. పనిచేస్తున్న చోట టెంట్‌లు, మెడికల్‌ కిట్లు ఉన్నాయా? అని కూలీలనడిగి తెలుసుకున్నారు. సరిపడా తాగు నీటిని ఉంచాలని ఫీల్డ్‌, టె క్నికల్‌ అసిస్టెంట్లను ఆదేశించారు.ఎప్పటికప్పుడు తేడాలు రాకుండా కొలతలు తీసుకోవాలన్నారు. జాబ్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తక్షణమే కార్డిచ్చి పని చూపాలని ఏపీవో లింగయ్యను ఆదేశించారు. హరితహారం నర్సరీల్లో మొక్కలెండకుండా చూడాలన్నారు. ఇ ప్పటికే నాటిన మొక్కలు ఎండితే వాటి స్థానం లో మళ్లీ మొక్కలు నాటించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. జిల్లాలో రోజుకు సరాసరి 27వేల నుంచి 30వేల మంది ఉపాధి కూలీలు పనులు చేస్తున్నారని ఆమె తెలిపారు. ఎక్కడ కూలీల వేతనాలు పెండింగ్‌లో లేవన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్‌ చేస్తా : డీఆర్‌డీఏ పీడీ

విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెండ్‌ చేస్తామని, కూలీలకు పనులు చూపడంతో పాటు కొలతల్లో, రికార్డు ల్లో తేడా లేకుండా డ్యూటీ చేయాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీలత ఉపాధి హమీ సిబ్బందిని హెచ్చరించారు. గ్రామాల్లో పర్యటనానంతరం మండల పరిషత్‌లో ఫీల్డ్‌/టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఏపీవోలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కూలీలు చేసిన పనులను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలన్నారు. వాస్తవ పనికి, రికార్డులకు వ్యత్యాసం ఉండకూడదన్నారు. మస్టర్లపై కూలీల సంతకాలు లేకుండా పని ఎలా చేయించారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎంబీ రికార్డులు సక్రమంగా లేకపోతే చర్యలు తప్పవన్నారు. సో షల్‌ ఆడిట్‌లో తేలిన తప్పులపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరెక్టుగా డ్యూటీ చేస్తే పొరపాట్లు దొర్లవన్నారు. అంకితభావంతో పనిచేయకుంటే బదిలీ లేదా సస్పెండ్‌ చేయడం ఖాయమన్నారు. సమావేశంలో ఏపీడీ సక్రియ, ఎంపీడీవో నరేందర్‌రెడ్డి, ఏపీవో లింగయ్య, ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌ శివశంకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - May 17 , 2024 | 12:48 AM

Advertising
Advertising