లైంగిక దాడి నిందితుడిపై ఫోక్సో కేసు
ABN, Publish Date - Jul 09 , 2024 | 12:29 AM
బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానంటూ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిపై పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఇబ్రహీంపట్నం, జూలై 8: ఆరు బయట ఆడుకుంటున్న 8ఏళ్ల బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానంటూ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిపై పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పరిధి తులేకలాన్‌లో బోడ నర్సింహ(50)అనే వ్యక్తి కూలిపని చేస్తుంటాడు. ఆదివారం సాయంత్రం స్థానికంగా ఆడుకుంటున్న బాలికకు పది రూపాయల నోటుచూపి చాక్లెట్ ఇప్పిస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికకు రక్తస్రావం కావడంతో విషయం తెలుసుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నర్సింహను అదుపులోకి తీసుకొని అతడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. చిన్నారికి చికిత్స చేయిస్తున్నారు.
Updated Date - Jul 09 , 2024 | 08:13 AM