ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దేశాభివృద్ధే బీజేపీ లక్ష్యం : ఎంపీలు ఈటల, కొండా

ABN, Publish Date - Sep 10 , 2024 | 11:34 PM

దేశాభివృద్ధే లక్ష్యంగా, ప్రజా శ్రేయస్సే ప్రధానంగా సాగుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీలు ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెడల లక్ష్మీనారాయణలు అన్నారు.

మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

శంషాబాద్‌, సెప్టెంబర్‌ 10 : దేశాభివృద్ధే లక్ష్యంగా, ప్రజా శ్రేయస్సే ప్రధానంగా సాగుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీలు ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెడల లక్ష్మీనారాయణలు అన్నారు. శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని వైఎన్‌ఆర్‌ గార్డెన్‌లో మంగళవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అధ్యక్షతన సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. వారు మాట్లాడుతూ బీజేపీలో చేరేందుకు 8800002024 నెంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చి సభ్యత్వం తీసుకోండి, దేశ ప్రగతిలో భాగస్వామ్యమవ్వండని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు బూత్‌స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని సూచించారు. బీజేపీ అధికార ప్రతినిధి వీరేందర్‌గౌడ్‌, రాష్ట్ర నాయకులు కట్టా వెంకటేశ్‌, డాక్టర్‌ ప్రేంరాజ్‌, టి.అంజన్‌కుమార్‌, పోరెడ్డి నర్సింహారెడ్డి, బోసుపల్లి ప్రతాప్‌, కేఎస్‌ రత్నం, లచ్చిరెడ్డి, శ్రీరాములు యాదవ్‌, కడారి జంగయ్యయాదవ్‌, ప్రభాకర్‌, ప్రకాష్‌, బుక్కా వేణుగోపాల్‌, శ్రీవర్దన్‌రెడ్డి, మల్లారెడ్డి, కొత్త అశోక్‌గౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు, తదితరులున్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:34 PM

Advertising
Advertising