ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వచ్చేనెల 4న వికారాబాద్‌కు మోదీ

ABN, Publish Date - Apr 25 , 2024 | 12:36 AM

పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 4వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికారాబాద్‌కు రానున్నారు. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఒకచోట మోదీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో వికారాబాద్‌లో మోదీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపారు.

వికారాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) : పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 4వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికారాబాద్‌కు రానున్నారు. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఒకచోట మోదీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో వికారాబాద్‌లో మోదీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపారు. హైదరాబాద్‌ శివారులో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇంతకు ముందు మోదీ, అమిత్‌షాలతో కార్యక్రమాలు నిర్వహించిన నేపథ్యంలో ఈసారి వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో మోదీ బహిరంగ సభ నిర్వహించాలని స్థానిక పార్టీ నాయకత్వం పట్టుదలతో ఉంది. మోదీ బహిరంగ సభ వికారాబాద్‌లో నిర్వహించాలా ? లేక చేవెళ్లలో నిర్వహించాలా ? ఎక్కడ మోదీ సభ నిర్వహిస్తే ఓటర్లపై ఎక్కువ ప్రభావం చూపుతుందనే విషయమై పార్టీ రాష్ట్ర నాయకత్వం స్థానిక నాయకత్వాలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్‌లో మోదీ బహిరంగ సభ నిర్వహిస్తే ఆ ప్రభావం జిల్లాలో వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలోని నియోజకవర్గాలపై కూడా ఆ ప్రభావం ఉంటుంది. కాగా, మోదీ బహిరంగ సభ నిర్వహించేందుకు అనుకూలమైన స్థలాలను బుధవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోకట్‌ మాధవరెడ్డి పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. స్థానిక ఎస్‌ఏపీ కళాశాలతో పాటు మద్గుల్‌ చిట్టంపల్లి పరిసరాలను కూడా బహిరంగ సభ నిర్వహించేందుకు పరిశీలించారు. ఒకటి, రెండు రోజుల్లో మోదీ బహిరంగ సభ విషయమై స్పష్టత రానుంది.

Updated Date - Apr 25 , 2024 | 12:36 AM

Advertising
Advertising