ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భార్య ఉండగా.. మరో మహిళతో వివాహం!

ABN, Publish Date - Jul 15 , 2024 | 12:13 AM

గుట్టు చప్పుడు కాకుండా రెండో వివాహం చేసుకోబోయిన భర్తను భార్య అడ్డుకునేందుకు యత్నించిన సంఘటన శంషాబాద్‌ మండలం నర్కూడ గ్రామ శివారులోని ఓ ఫాంహౌ్‌సలో జరిగింది. శంషాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌ ప్రాంతానికి చెందిన కవిత, సిద్థార్థలు 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

పెళ్లిని అడ్డుకునేందుకు మొదటి భార్య విఫలయత్నం

గుట్టుచప్పుడు కాకుండా రెండో వివాహం చేసుకున్న భర్త

పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు.. విచారణ

శంషాబాద్‌ రూరల్‌, జూలై 14: గుట్టు చప్పుడు కాకుండా రెండో వివాహం చేసుకోబోయిన భర్తను భార్య అడ్డుకునేందుకు యత్నించిన సంఘటన శంషాబాద్‌ మండలం నర్కూడ గ్రామ శివారులోని ఓ ఫాంహౌ్‌సలో జరిగింది. శంషాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌ ప్రాంతానికి చెందిన కవిత, సిద్థార్థలు 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఏడేళ్ల కూతురు ఉంది. కాగా, కొన్ని రోజులుగా కవితను సిద్ధార్థ కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేయడంతో పాటు ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సిద్ధార్థ ఆదివారం వేరే మహిళను పెళ్లి చేసుకునేందుకు గుట్టు చప్పుడు కాకుండా శంషాబాద్‌ శివారు నర్కూడ గ్రామ సమీపంలోని ఓ ఫాంహౌ్‌సలో ఏర్పాట్లు చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య కవిత శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఫాంహౌస్‌ దగ్గరికి వెళ్లి పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆమె రాకను పసిగట్టిన సిద్ధార్థ అక్కడి నుంచి పారిపోయి వేరేచోట ఓ గుడిలో పెళ్లిచేసుకున్నట్లు సమాచారం. కాగా, బాధితురాలు డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు స్పందించారు. సిద్ధార్థ్‌ మరో వివా హం చేసుకునేందుకు ఆహ్వానించిన బంధువులు అక్కడికి బస్సులో చేరుకోగా.. పెళ్లి జరగడం లేదని తెలుసుకున్న బంధువులు బస్సులో వెనుతిరి గి వెళ్తుండగా కవిత బస్సుకు అడ్డం కూర్చొంది. ఈ సందర్భంగా కవితకు పలువురు మహిళా సంఘాల నాయకురాల్లు మద్దతు తెలిపారు. దాంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు బాధితురాలికి నచ్చజెప్పి అక్కడి నుంచి పెళ్లికి వచ్చిన బస్సును పంపించారు. సిద్ధార్థ్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Updated Date - Jul 15 , 2024 | 12:13 AM

Advertising
Advertising
<