ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తాళం వేసిన ఇంటికి కన్నం

ABN, Publish Date - May 17 , 2024 | 12:36 AM

తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం వేసి రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు దొంగిలించిన ఘటన కందుకూరు పోలీస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

రెండున్నర తులాల బంగారం.. రూ.50వేల అపహరణ

కందుకూరు, మే 16 : తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం వేసి రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు దొంగిలించిన ఘటన కందుకూరు పోలీస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు గురువారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నేదునూరు గ్రామానికి చెందిన కొమ్ము జంగయ్య కుటుంబ సభ్యులతో బుధవారం రాత్రి ఇంట్లో భోజనం చేసిన అనంతరం ఇంటికి తాళం వేసి స్లాబ్‌పై నిద్రించారు. గురువారం తెల్లవారుజామున జంగయ్య భార్య నవనీత ఉదయం చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరువాలో వస్తువులు, బట్టలు చిందరవందరగా ఉన్నాయి. కందుకూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదును దొంగించినట్లు ఫిర్యాదు చేసిన ట్లు సీఐ మక్భూల్‌జానీ తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - May 17 , 2024 | 09:34 AM

Advertising
Advertising