లిక్విడ్ గంజాయి విక్రేతల రిమాండ్
ABN, Publish Date - Aug 18 , 2024 | 12:08 AM
ఆదిభట్ల పరిధిలో గంజా యి విక్రయిస్తూ శుక్రవారం పట్టుబడిన ముగ్గురిని శనివారం రిమాండ్‌కు తరలించారు.
ఆదిభట్ల, ఆగస్టు 17 : ఆదిభట్ల పరిధిలో గంజా యి విక్రయిస్తూ శుక్రవారం పట్టుబడిన ముగ్గురిని శనివారం రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.30లక్షల విలువైన 3.8కిలోల గంజాయి లిక్విడ్, మూడుసెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. సీఐ రాఘవేందర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలోని విశాఖప ట్నం జిల్లా కింతిలి వల్లాపురానికి చెందిన టి.సుధీర్, టి.దేముళ్లు వ్యవసాయం చేస్తుంటారు. ఇదే జిల్లా చిన్నపచిలకు చెందిన కె.శంకర్‌రావు కూల్‌డ్రి ంక్స్ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం చేస్తుంటాడు. వీరు ముగ్గురికి పరిచయం ఉన్న ఒడిషాకు చెందిన శ్రీను అలియాస్ తేజూ అనే వ్యక్తి ద్వారా ద్రవరూపంలోకి మార్చిన గంజాయిని లిక్విడ్(హహీష్ ఆయిల్)ను కొని హైదరాబాద్ పరిసరాల్లో ఐటీ ఉద్యోగులు, ఇంజినీరింగ్ విద్యార్థులకు విక్రయిస్తున్నారు. శుక్రవారం విశాఖ నుంచి హహీష్ ఆయిల్‌ను తెచ్చినట్టు సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్వోటీ టీం, పోలీసులు దాడిచేసి నిందితులను పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను శనివారం రిమాండ్‌కు తరలించారు. గంజాయి స్మగ్లింగ్ నిందితులు రూటు మార్చి ద్రవరూపంలోకి మార్చి హ హీష్ ఆయిల్‌ను కిలో రూ.8లక్షలకు విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కిలో ఆయిల్ తయారీకి 35-40కిలోల ఎండు గంజాయిని వినియోగిస్తార న్నారు. కేవలం 5ఎంఎల్‌హహీష్ ఆయిల్ తీసుకుంటేనే వ్యక్తి పూర్తి మత్తులోకి జారతాడన్నారు. సుధీర్, దేముళ్లు, శంకర్‌రావులను మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆదిభట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి, ఎస్సైలు రాజు, వెంకటే్‌ష, పోలీసులు శ్రీశైలం, బాలరాజు, ఎస్వోటీ టీం పాల్గొన్నారు.
Updated Date - Aug 18 , 2024 | 12:11 AM