ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కోర్టు ఆదేశాలతో కేరెళ్లిలో భూ సర్వే

ABN, Publish Date - Apr 25 , 2024 | 12:35 AM

మండల పరిధిలో కేరెళ్లి గ్రామంలో కోర్టు ఆదేశాల మేరకు బుధవారం చెన్‌గోముల్‌ ఎస్సై మధుసూధన్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని సర్వేనెంబర్‌-94 గల భూమిని సర్వే చేయించారు. గతంలో ఈ భూమి గ్రామ రెవెన్యూ రికార్డుల ప్రకారం 11 ఎకరాలు ఉండగా, ఇదే సర్వేనెంబర్‌లో గ్రామానికి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తికి 21 ఎకరాల 22గుంటలు ఉన్నట్లు ఆయనకు ఇచ్చిన పట్టాలో ఉంది.

పూడూరు, ఏప్రిల్‌ 24 : మండల పరిధిలో కేరెళ్లి గ్రామంలో కోర్టు ఆదేశాల మేరకు బుధవారం చెన్‌గోముల్‌ ఎస్సై మధుసూధన్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని సర్వేనెంబర్‌-94 గల భూమిని సర్వే చేయించారు. గతంలో ఈ భూమి గ్రామ రెవెన్యూ రికార్డుల ప్రకారం 11 ఎకరాలు ఉండగా, ఇదే సర్వేనెంబర్‌లో గ్రామానికి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తికి 21 ఎకరాల 22గుంటలు ఉన్నట్లు ఆయనకు ఇచ్చిన పట్టాలో ఉంది. అయితే, రికార్డు తప్పుగా రాయడం వల్ల అలా జరిగి ఉంటుందని గ్రామస్తులు ఆరోపించారు. ఒకవేళ సర్వేనెంబర్‌-94లో ఇబ్రహీంకు 21ఎకరాల 22గుంటల భూమి ఉంటే, మా చుట్టుపక్కల ఉన్న సర్వేనెంబర్లలో కూడా మా భూమి మాకు ఉండాలని వారు ఆరోపించారు. అదే గ్రామానికి చెందిన మహ్మద్‌ జాఫర్‌ సర్వేనెంబర్‌ 94కు ఆనుకుని ఉన్న 75/26 సర్వే నెంబర్లలో 2 ఎకరాల 39గుంటల అనువంశికంగా వచ్చిన అసైన్డ్‌ భూమి ఉంది. కొత్తగా కోర్టు ఆదేశాల మేరకు గ్రామ రెవెన్యూ రికార్డుల ప్రకారం.. అధికారులు ఇప్పుడున్న సర్వే లెక్క ప్రకారం చూస్తే జాఫర్‌కు ఉన్న అసైన్డ్‌ ల్యాండ్‌కు 94 సర్వేనెంబర్‌లో కలిసిపోతుంది. కావాలని గత రికార్డులను మార్చి కొందరు భూదందాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామ రికార్డు ప్రకారమే కోర్టు సర్వే నిర్వహించాలని ఆదేశించిందని అన్నారు. తమకు అన్యాయం జరిగితే ఎక్కడికైనా వెళతామని వారు హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సర్వే చేస్తానని సర్వేయర్‌ తెలిపారు.

Updated Date - Apr 25 , 2024 | 12:35 AM

Advertising
Advertising