15ఏళ్ల లోపు పిల్లలకు జేఈ వ్యాక్సినేషన్
ABN, Publish Date - Jul 26 , 2024 | 12:05 AM
జిల్లాలోని 15 సంవత్సరాల లోపు పిల్లలందరికీ జపనీస్ ఎన్సెఫాలిటి్‌స(జేఈ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వికారాబాద్ వైద్యారోగ్య శాఖ అధికారి పల్వన్ కుమార్ అన్నారు.
వికారాబాద్/మేడ్చల్(ఆంధ్రజ్యోతి), జూలై 25 : జిల్లాలోని 15 సంవత్సరాల లోపు పిల్లలందరికీ జపనీస్ ఎన్సెఫాలిటి్‌స(జేఈ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వికారాబాద్ వైద్యారోగ్య శాఖ అధికారి పల్వన్ కుమార్ అన్నారు. గురువారం వికారాబాద్ మండలం సిద్ధులూరు పీహెచ్‌సీలో పిల్లలకు జేఈ వ్యాక్సినేషన్ వేసి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నవాబ్‌పేట్, మోమిన్‌పేట, పట్లూర్, బంట్వారం పీహెచ్‌సీల్లో జేఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. తల్లిదండ్రులందరూ వారి పిల్లలకు జేఈ వ్యాక్సినేషన్ వేయించి పిల్లల మెదడువాపు వ్యాధికి గురికాకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న కృషికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మెదడు వాపు వ్యాధి నివారణ వ్యాక్సినేషన్‌ను డీఎం హెచ్‌వో రఘునాథస్వామి, వైద్యులు శ్రీదేవి, మల్లీశ్వరి, సరస్వతిలతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బ్రెయిన్ ఫీవర్ అని పిలిచే ఈ వ్యాధి జపనీస్ ఎన్సెఫాలిటి్‌స(జేఈ) సోకిన దోమ కుడితే వస్తుందన్నారు. జిల్లాలో జేఈ టీకా ఆగస్టు 15 వరకు వేస్తామని తెలిపారు. ఈ వ్యాక్సిన్ 1 నుంచి 15ఏళ్ల పిల్లలకు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో వేస్తామన్నారు. జిల్లాలో 9నెలలు నుంచి 15ఏళ్ల పిల్లలు 4,86,037 మంది ఉన్నట్టు గుర్తించామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ వ్యాక్సిన్ వేయించాలని సూచించారు.
Updated Date - Jul 26 , 2024 | 12:05 AM