ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నా ఓటు వేసేదెలా?

ABN, Publish Date - May 14 , 2024 | 12:42 AM

ఓటు వేసేందుకు వెళ్లిన వ్యక్తికి అప్పటికే తన ఓటును పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వినియోగించుకున్నారని అధికారులు చెప్పడంతో అవాక్కయ్యాడు.

వేరే వ్యక్తి వేస్తే నా పరిస్థితేంటి?

అధికారులను ప్రశ్నించిన ఓటరు

పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వినియోగించుకున్నారని చెప్పిన అధికారులు

విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌

కలెక్టర్‌ ఆదేశంతో ఎట్టకేలకు ఓటుహక్కు వినియోగించుకున్న ఓటరు

బంట్వారం, మే 13(ఆంధ్రజ్యోతి) : ఓటు వేసేందుకు వెళ్లిన వ్యక్తికి అప్పటికే తన ఓటును పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వినియోగించుకున్నారని అధికారులు చెప్పడంతో అవాక్కయ్యాడు. నా ఓటు హక్కును వేరే వ్యక్తి వినియోగించుకున్నాడని, అలాంటప్పుడు తాను ఓటు ఎలా వేయాలని అధికారులను ప్రశ్నించాడు. వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండల కేంద్రానికి చెందిన దొరెటి సుధాకర్‌ సోమవారం ఓటు వెయ్యడానికి బూత్‌(253)కు వెళ్లాడు. తీరా చూస్తే అప్పటికే అతడి ఓటు హక్కును వేరే వ్యక్తి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వినియోగించుకున్నాడని తెలుసుకున్నాడు. తాను ప్రభుత్వ ఉద్యోగిని కాదని, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఎలా ఓటు వేస్తానని అధికారులను ప్రశ్నించాడు. దానికి వారు సరైన సమాధానం చెప్పకుండా బూత్‌ లోపల నుంచి వెళ్లిపోవాలని సుధాకర్‌కు సూచించారు. ఈ విషయమై స్థానిక ఎన్నికల సహాయ అధికారికి వివరించగా.. సరైన సమాధానం చెప్పలేకపోయారు. నాకు నా ఓటు ముఖ్యం.. నా హక్కును నేను వినియోగించుకుంటానని సుధాకర్‌ బయటకు వచ్చి అధికారులను ప్రాధేయపడినా సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. దాంతో ఈ విషయం స్థానిక విలేకరులకు తెలియజేయడంతో అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశాలతో ఎట్టకేలకు సుధాకర్‌ ఓటు వినియోగించుకున్నాడు.

Updated Date - May 14 , 2024 | 12:42 AM

Advertising
Advertising