ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

ABN, Publish Date - May 17 , 2024 | 12:52 AM

వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా సేకరించాలని వికారాబాద్‌ అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌ సూచించారు.

కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌

పరిగి, మే 16: వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా సేకరించాలని వికారాబాద్‌ అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌ సూచించారు. పరిగి మ ండలం సుల్తాన్‌పూర్‌లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని సూచించారు. టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వడ్లను పూర్తిగా ఎండబెట్టిన కొనుగోలు కేంద్రాలకు తీసుకవచ్చేలా రైతులకు సూచించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్య్నాన వెంటనే మిల్లులకు చేరే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అదికారి రాజేశ్వర్‌, జిల్లా మేనేజర్‌ సుగుణబాయిలు ఉన్నారు.

బొంరా్‌సపేట్‌: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుం డా చూడాలని అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌ నిర్వాహకులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. చిరుజల్లులు కు రుస్తుండగా రైతులు ధాన్యాన్ని టార్పాలిన్‌లతో కప్పుతుండగా పరిశీలించారు. ఐకేపీ మహిళల తో ఆయన మాట్లాడుతూ రై తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణను పూర్తి చేయాలన్నారు. హమాలీల కొరతను తీర్చేందుకు అవసరమైన లేబర్‌ల ను సమకూర్చుకోవాలన్నారు. ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లను రైతులకు ఇవ్వాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులను సంప్రదించి గన్నీబ్యాగులను సమకూర్చుకోవాలన్నా రు. రైతులు వాతావరణ పరిస్థితులను అంచనావేస్తూ ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలన్నారు. 17శాతం తేమ ఉన్న వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి లారీల ద్వారా మిల్లులకు తరలించాలని సూచించారు. ఉన్నతాధికారుల సాయం కోసం సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా డీసీయంఎస్‌ నాగమణి, డీసీఎ్‌సవో రాజేశ్వర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రవి, సీసీ యాదయ్య, నిర్వాహకులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2024 | 12:52 AM

Advertising
Advertising