గౌడ కులస్తులు అన్నిరంగాల్లో ముందుకు సాగాలి
ABN, Publish Date - Sep 02 , 2024 | 12:14 AM
గౌడ కులస్తులు అన్నిరంగాల్లో ముందుకు సాగాలని, గౌడ సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు.
మొయినాబాద్, సెప్టెంబరు 1 : గౌడ కులస్తులు అన్నిరంగాల్లో ముందుకు సాగాలని, గౌడ సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. ఆదివారం మొయినాబాద్ మండల కేంద్రంలో గౌడ సంఘం సమావేశం నిర్వహించారు. అనంతరం మొయినాబాద్ మండల గౌడ సంఘం నూతన కమిటీని ఎంపిక చేశారు. మండలాధ్యక్షుడుగా బి.అంజయ్యగౌడ్, ఉపాధ్యక్షుడిగా అల్లం సత్యనారాయణగౌడ్, చిలుకూరి భిక్షపతిగౌడ్, యూత్ కమిటీ అధ్యక్షుడిగా చేగూరి విజయ్‌గౌడ్, ఉపాధ్యక్షులుగా బి.యాదయ్యగౌడ్, దేవేందర్‌గౌడ్ తదితరులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో గౌడకుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అఽధ్యక్షుడు రేవట్ల మల్లే్‌షగౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సిద్ధాంతి నర్సింహగౌడ్, ఉపాధ్యక్షుడు ఎల్గని అశోక్‌గౌడ్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 02 , 2024 | 12:14 AM