ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ను పరిరక్షించండి

ABN, Publish Date - Sep 04 , 2024 | 12:14 AM

చెరువులు, కుంటలు, పాటుకాలువలను పరిరక్షించుటలో పాలకులు స్వార్థపూరితంగా వ్యవహరించడంతోనే ప్రకృతి ప్రకోపానికి కారణమవుతున్నదని, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లను పరిరక్షించాలని మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అన్నారు.

మామిడికుంట బఫర్‌ జోన్‌లో నిర్మించిన విల్లాలను చూపిస్తున్న బక్కని నర్సింహులు

సీఎస్‌కే విల్లాస్‌పై విచారణ జరిపించాలి

మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు

షాద్‌నగర్‌ అర్బన్‌, సెప్టెంబరు 3: చెరువులు, కుంటలు, పాటుకాలువలను పరిరక్షించుటలో పాలకులు స్వార్థపూరితంగా వ్యవహరించడంతోనే ప్రకృతి ప్రకోపానికి కారణమవుతున్నదని, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లను పరిరక్షించాలని మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అన్నారు. ఫరూఖ్‌నగర్‌ శివారు జాలాదికుంట, మామిడికుంటలను టీడీపీ నాయకులతో కలిసి మంగళవారం పరిశీలించారు. రెండు కుంట మ్యాప్‌లను, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో కట్టిన నిర్మాణాలను పరిశీలించారు. జాలాదికుంట, మామిడికుంట ఎఫ్‌టీఎల్‌, బఫ్‌ర్‌ జోన్లలో సీఎ్‌సకే విల్లాలను నిర్మించారని, వాటిపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆజాం అల్లిఖాన్‌ తోటలోని చారిత్రాత్మక కట్టడాలను సైతం కూల్చి, పూడ్చివేసి, సీఎ్‌సకే విల్లాలను నిర్మించారని గుర్తుచేశారు. ఈ వ్యవహారాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామ భూపాల్‌రెడ్డి, అధికార ప్రతినిధులు నెల్లూరు దుర్గాప్రసాద్‌, డాక్టర్‌ ఏఎస్‌ రావులు డిమాండ్‌ చేశారు. టీడీపీ నాయకులు లింగారం కుమార్‌గౌడ్‌, చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, వెంకటయ్య, గంధం ఆనంద్‌, శ్రీరాములు, అనంతం, శ్రీనివాస్‌, కుమార్‌ తదితరులున్నారు.

మామిడికుంట గండి పరిశీలన

భారీ వర్షాలకు ఫరూఖ్‌నగర్‌ శివారులో గల మామిడికుంట కట్టపై నుంచి వరద నీరు పోవడంతో గండి పడింది. దాంతో షాద్‌నగర్‌ నుంచి బొబ్బిలిచెరువు మీదుగా రాసుమల్లెగూడెంకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈమేరకు మంగళవారం బక్కని నర్సింహులు, టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. అధికారులు గండిని వెంటనే పూడ్చాలని ఆయన కోరారు.

Updated Date - Sep 04 , 2024 | 12:14 AM

Advertising
Advertising