ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కబేళాకు తరలిస్తున్న పశువులు పట్టివేత

ABN, Publish Date - Apr 17 , 2024 | 11:59 PM

పశువులను కబేళాకు తరలిస్తున్న కంటైనర్‌ను అదుపులోకి తీసుకొని నలుగురిపై కేసు నమోదు చేసిన సంఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సైదులు తెలిపిన ప్రకారం..

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 17 : పశువులను కబేళాకు తరలిస్తున్న కంటైనర్‌ను అదుపులోకి తీసుకొని నలుగురిపై కేసు నమోదు చేసిన సంఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సైదులు తెలిపిన ప్రకారం.. ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధి ఎదులాబాద్‌లో రోడ్డులో బుధవార ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదస్థితిలో బీబీనగర్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళుతున్న కంటైనర్‌ను తనిఖీ చేశారు. అందులో తాళ్లతో క్రూరంగా కట్టేసిన 80 పశువులను గుర్తించారు. 36 ఎద్దులు, 44 ఆవులలో ఒక ఆవు మృతిచెందింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గంగేరు గ్రామానికి చెందిన డ్రైవర్‌ షామీమ్‌ అహ్మద్‌ను విచారించగా, ఒడిస్సాలోని సంతలో సబావత్‌ విజయ్‌కుమార్‌ 80 పశువులను కొనుగోలు చేసి హైదరబాద్‌లోని బహదూర్‌పుర కబేళాకు కంటైనర్‌లో తరలిస్తున్నట్లు తెలిపారు. కాగా, కంటైనర్‌లో డ్రైవర్‌ షామీ అహ్మద్‌తో పాటు మరో డ్రైవర్‌ సాజిద్‌ అక్కడి నుంచి తప్పించుకోగా కూలీపని చేసే గంగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశువులను గోశాలకు తరలించి, నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న సాజిద్‌ను, సబావత్‌ విజయ్‌కుమార్‌లను త్వరలో అరెస్టు చేసి తీసుకోని రిమాండ్‌కు తరలించనున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Apr 18 , 2024 | 07:59 AM

Advertising
Advertising