ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కనుల పండువగా బోనాలు

ABN, Publish Date - Jul 31 , 2024 | 12:23 AM

మండలంలోని ఎర్రోనిగూడ, షాబాద్‌, మాచన్‌పల్లి, అంతిరెడ్డిగూడ, తదితర గ్రామాల్లో మంగళవారం పోచమ్మ, మైసమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు.

శంషాబాద్‌ రూరల్‌ : పోచమ్మ తల్లి తొట్టెల ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ నాయకులు తదితరులు

షాబాద్‌, జూలై 30 : మండలంలోని ఎర్రోనిగూడ, షాబాద్‌, మాచన్‌పల్లి, అంతిరెడ్డిగూడ, తదితర గ్రామాల్లో మంగళవారం పోచమ్మ, మైసమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, యువకుల కేరింతల మధ్య బోనాలు, తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. గ్రామస్తులంతా అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తరలివెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు బోన నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామస్తులు పాల్గొన్నారు.

శంషాబాద్‌ రూరల్‌ : శంషాబాద్‌ మండలంలోని నర్కూడ గ్రామంలో మంగళవారం నేతాజీ యువజన సంఘం, ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి తొట్టెల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌, శంషాబాద్‌ మండల మాజీ జడ్పీటీసీ నీరటి తన్వీరాజ్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు గడ్డం శేఖర్‌యాదవ్‌ తదితరులు హాజరయ్యారు. గ్రామ దేవత పోచమ్మ తల్లి ఊరేగింపు సందర్భంగా డప్పుల దరువు, యువకుల కేరింతలు, పోతురాజుల విన్యాసాలు చూపరులను ఎంతో ఆకట్టుకున్నాయి. గ్రామస్తులు పోచమ్మ తల్లికి నైవేద్యాలు సమ ర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని మొక్కుకున్నారు. చంద్రశేఖర్‌రెడ్డి, శివాజీ, నీరటి కృష్ణ, శేఖర్‌, అశోక్‌, లింగం బిక్షపతి, లింగం నర్సింహ, నర్సింగ్‌రావు, సాయినాథ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 12:23 AM

Advertising
Advertising
<