ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బాణామతి నెపంతో మహిళపై దాడి

ABN, Publish Date - Jun 17 , 2024 | 12:37 AM

జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం రావిర్యాలలో ఓ మహిళ బాణామతి చేస్తుందనే నెపంతో చెట్టుకు కట్టేసి కొట్టిన సంఘటన జిల్లేడ్‌ చౌదరిగూడ మండలంలోని రావిర్యాల గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.

9 మందిపై కేసు.. జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం రావిర్యాలలో ఘటన

చౌదరిగూడ, జూన్‌ 16: జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం రావిర్యాలలో ఓ మహిళ బాణామతి చేస్తుందనే నెపంతో చెట్టుకు కట్టేసి కొట్టిన సంఘటన జిల్లేడ్‌ చౌదరిగూడ మండలంలోని రావిర్యాల గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితురాలు పద్మమ్మ ఫిర్యాదు మేరకు జిల్లేడ్‌ చౌదరిగూడ పోలీసులు దాడికి పాల్పడిన తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. ఆదివారం ఎస్సై సక్రం తెలిపిన వివరాల ప్రకారం.. రావిర్యాల గ్రామానికి చెందిన పద్మమ్మ శ్మశానం నుంచి బూడిద తీసుకొని వచ్చి గ్రామలో చెట్లపై చల్లినట్లు నటిస్తూ పక్క ఇళ్లపై చల్లుతోందని గ్రామస్తులు గమనించి చెట్టుకు కట్టేసి కొట్టారని తెలిపారు. ఈమేరకు ఆమెపై దాడి చేసిన 9మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సక్రం తెలిపారు. చేతబడి, బాణామతి అనేవి మూఢనమ్మకాలని, అలాంటి వదంతులు నమ్మవద్దని, ఎవరైనా అలాంటి పుకార్లు సృష్టించనట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అదించాలని ఎస్సై తెలిపారు.

Updated Date - Jun 17 , 2024 | 12:37 AM

Advertising
Advertising