పేకాడుతున్న ఐదుగురి అరెస్ట్
ABN, Publish Date - Aug 24 , 2024 | 11:29 PM
మండలంలోని అచ్యుతాపూర్ గ్రామంలో పేకాఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ శంకర్ తెలిపారు.
యాలాల, ఆగస్టు 24: మండలంలోని అచ్యుతాపూర్ గ్రామంలో పేకాఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ శంకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అచ్యుతాపూర్ గ్రామంలో కొంత మంది పేకాడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడి చేయగా గ్రామంలో ఉన్న ఒక ఇంట్లో అదే గ్రామానికి చెందిన ఐదుగురు పేకాట ఆడుతున్నారని చెప్పారు. వారిని పట్టుకొని వారి దగ్గర ఉన్న రూ.8200 సీజ్ చేసినట్లు తెలిపారు.
Updated Date - Aug 24 , 2024 | 11:29 PM