వాహనాన్ని ఢీకొని యువకుడి దుర్మరణం
ABN, Publish Date - Aug 24 , 2024 | 11:59 PM
నడిరోడ్డుపై ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని బైక్ ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న యువకుడు దుర్మరణం చెందగా మరో యువకుడు గాయపడ్డాడు.
యాచారం, ఆగస్టు 24: నడిరోడ్డుపై ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని బైక్ ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న యువకుడు దుర్మరణం చెందగా మరో యువకుడు గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. శనివారం ఉదయం యాచారం మండలం మాల్‌కు చెందిన శివకోటి(21), అతడి చిన్నన్న కొడుకు విష్ణుతో కలిసి మంచాల మండలం నోములకు బైక్‌పై బ యల్దేరారు. నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారిపై మెట్ట వ్యవసాయ పరిశోధన కేంద్రం వద్ద నడీరోడ్డుపై బొలెరో వాహనం నిలిపి ఉంది. ఇది యువకులు గమనించకుండా వేగంగా బొలెరోను వెనక నుంచి ఢీకొట్టారు. దీంతో శివకోటి అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన విష్ణును పెట్రోమొబైల్-1 పోలీసులు ఇబ్రహీంపట్నంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకర్‌కుమార్ తెలిపారు.
Updated Date - Aug 24 , 2024 | 11:59 PM