ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహేశ్వరంలో పర్యాటక నగరం

ABN, Publish Date - Jul 15 , 2024 | 12:08 AM

రంగారెడ్డి జిల్లాకు మహర్దశ రానుందని, ప్రపంచంలోనే అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

ప్రజలకు నమస్కారం చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి; కార్యక్రమానికి హాజరైన గీత కార్మికులు, స్థానిక ప్రజలు

ప్రపంచంలోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాం

అభివృద్ధి ప్రాజెక్టులతో జిల్లాకు మహర్దశ!

న్యూయార్క్‌ నగరంతో పోటీపడేలా మహేశ్వరంలో నూతన నగరాన్ని నిర్మించే బాధ్యత సర్కారుదే

హైదరాబాద్‌ ఫార్మా భూముల్లో యూనివర్సిటీలు, మెడికల్‌ టూరిజం, పరిశ్రమల ఏర్పాటు

రాచకొండ ప్రాంతాన్ని ఫిల్మ్‌ ఇండస్ట్రీ కేంద్రంగా మార్చుతాం

త్వరలోనే హయత్‌నగర్‌కు మెట్రో.. నేరుగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునేలా ప్రణాళిక

ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో జిల్లాలో పెరిగిన భూముల విలువ

గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

పలు అభివృద్ధి ప్రాజెక్టుల రాకతో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ పట్టనుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, దీనికి మరింత ఊతం ఇచ్చేలా ప్రభుత్వం నూతన ప్రాజెక్టులను చేపట్టనుందని పేర్కొన్నారు. ఆదివారం అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం లష్కర్‌గూడ తాటివనంలో గౌడన్నలకు రక్షణ కవచం కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా సీఎం హాజరై ప్రసంగించారు. గతంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఎయిర్‌పోర్టు వంటి బడా ప్రాజెక్టులు కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలోనే వచ్చాయన్నారు. రానున్న కాలంలో న్యూయార్క్‌ నగరానికి పోటీ పడేలా మహేశ్వరంలో నూతన పర్యాటక నగరాన్ని నిర్మించనున్నామని తెలిపారు. కుల వృత్తుల వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

(ఆంధ్రజ్యోతి-రంగారెడ్డి అర్బన్‌, జూలై 14): రంగారెడ్డి జిల్లాకు మహర్దశ రానుందని, ప్రపంచంలోనే అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం లష్కర్‌గూడ తాటివనంలో సీఎం ఆదివారం ఈత మొక్క నాటారు. గౌడన్నలతో సీఎం, అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మంత్రులు సహపంక్తి భోజనాలు చేశారు. గీత కార్మికులకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ కిట్‌ పనితీరును బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి బుర్ర వెంకటేశం సీఎంకు వివరించారు. అనంతరం గీత కార్మికులతో సీఎం ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం ప్రసంగిస్తూ.. అమెరికాలోని న్యూయార్క్‌ నగరంతో పోటీ పడేలా మహేశ్వరంలో ఒక అత్యద్భుత నగరాన్ని నిర్మించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఊటీ కంటే మెరుగ్గా రాచకొండ ప్రాంతాన్ని ఫిల్మ్‌ ఇండస్ట్రీకి అణువుగా మార్చబోతున్నామన్నారు. ఓడిపోయి ఫామ్‌ హౌస్‌లో ఉన్నోళ్లను అడుగుతున్నా.. ఔటర్‌ రింగ్‌ రోడ్‌, ఫార్మా ఇండస్ట్రీ, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ తెచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కాదా? అని ప్రశ్నించారు. తామేం తెచ్చారో ప్రజలకు చెప్పాలని మాజీ పాలకులకు సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి పనులతోనే జిల్లాలో భూముల విలువ పెరిగిందన్నారు. డ్రగ్స్‌, గంజాయిలను సమూలంగా నిర్మూలిస్తామన్నా రు. త్వరలోనే హయత్‌నగర్‌కు మెట్రో రానుందని, ఇందుకు ప్రణాళికలూ పూర్తయ్యాయని తెలిపారు. హయత్‌నగర్‌లో మెట్రో ఎక్కితే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ఫార్మా కంపెనీల కోసం సేకరించిన భూముల్లో వివిధ యూనివర్సిటీలను, మెడికల్‌ టూరిజం, పరిశ్రమల ఏర్పాటు చేసేలా పథకాలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో తాటి వనాలు తగ్గుతున్నాయని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత చెట్లు పెంచుతామని తెలిపారు. వన మహోత్సవంలో తాటి, ఈత చెట్లను పెంపకం చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. చెరువు కట్టలపై ఈత మొక్కలు నాటేలా అధికారులతో చర్చించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబుకు సూచించారు. గౌడన్నలు పౌరుషానికి, పోరాటాలకు ప్రతీకలని కొనియాడారు. జిల్లాకు ఎన్నో కీలక ప్రాజెక్టులు తేవటంలో మాజీ మంత్రి టి.దేవేందర్‌గౌడ్‌ కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం కుల వృత్తుల కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. కుల వృత్తుల వారు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దాలని సీఎం పిలుపునిచ్చారు.

‘పట్నం’ నియోజకవర్గానికి ఐటీ కంపెనీలు తెండి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు కృషిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కోరారు. నియోజకవర్గంలో వందల ఎకరాల్లో ప్రభుత్వ భూములున్నాయని, వాటిల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు కృషిచేయాలని కోరారు. దాంతో నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయన్నారు. కోహెడలో ఫ్రూట్‌ మార్కెట్‌ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత పాలకులు ‘పట్నం’ నియోజవర్గంలోనే 2వేల ఎకరాల భూములను అమ్మేశారని ఆరోపించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, డి.శ్రీధర్‌బాబు, భువనగిరి ఎంపీ శ్యామా కిరణ్‌కుమారర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, దయానంద్‌, మల్లేశం, ఎవీఎన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్‌, మాజీ ఎంపీ ముధుయాష్కీగౌడ్‌, కలెక్టర్‌ శశాంక, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, ఆర్డీవో అనంతరెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 12:28 AM

Advertising
Advertising
<