మద్యం మత్తులో హైవేపై వ్యక్తి హల్‌చల్
ABN, Publish Date - Jun 08 , 2024 | 11:19 PM
మద్యం మత్తులో ఓవ్యక్తి షర్టు విప్పి జాతీయ రహదారి పై హల్‌చల్ చేశాడు. ఫలితంగా నిత్యం వాహనాలతో కిక్కిరిసి ఉండే రహదారిపై మరింత వాహనాలు నిలిచిపోయాయి.
మేడ్చల్ టౌన్, జూన్ 8: మద్యం మత్తులో ఓవ్యక్తి షర్టు విప్పి జాతీయ రహదారి పై హల్‌చల్ చేశాడు. ఫలితంగా నిత్యం వాహనాలతో కిక్కిరిసి ఉండే రహదారిపై మరింత వాహనాలు నిలిచిపోయాయి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయ జాతీయ రహదారిపై శనివారం ఓవ్యక్తి మద్యం మత్తులో తన షర్టును తీసేసి రోడ్డుమీద పడుకున్నాడు. అతడు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడని భావించిన స్థానికులు అతడిని రోడ్డుపైనుంచి పక్కకు తీసుకురావటానికి ప్రయత్నించారు. అయినా అతడు అతడు వినిపించుకోకుండా రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు. అయినప్పటికీ వినకపోవటంతో 100కు డయిల్ చేయగా పోలీసులు అతన్ని రోడ్డు పక్కన కూర్చోబెట్టారు. అనంతరం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.
Updated Date - Jun 08 , 2024 | 11:19 PM