ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బావిలో ఈతకు వెళ్లి వ్యక్తి గల్లంతు

ABN, Publish Date - May 17 , 2024 | 12:38 AM

బావిలో ఈతకు వెళ్ళిన వ్యక్తి గల్లంతైన ఘటన మండలంలోని కొల్కులపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..

మాడ్గుల, మే 16 : బావిలో ఈతకు వెళ్ళిన వ్యక్తి గల్లంతైన ఘటన మండలంలోని కొల్కులపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్కులపల్లి ఎంపీటీసీ, కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షులు భట్టు కిషన్‌రెడ్డికి చెందిన బావిలో నర్సాపల్లి గ్రామానికి చెందిన బైకని కొమరయ్య(35)అనే వ్యక్తి గురువారం ఈత కొట్టటానికి వెళ్ళి నీటిలో ముగినిపోయాడు. అక్కడే ఉన్న మరికొందరు గమనించి డయల్‌ 100కు కాల్‌ చేయడంతో వారు ఫైర్‌ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి వచ్చి శవాన్ని బయటికి తీయటానికి యత్నించినా ఫలితం లేకపోయినట్లు సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. వర్షం కారణంగా బయటకు తీయలేకపోయామన్నారు. రాత్రి వరకూ యత్నించి, తిరిగి శుక్రవారం ఎలాగైనా బయటకు తీస్తామన్నారు. కాగా, మద్యం సేవించిన కొమరయ్య బావిలో ఈత కొట్టేందుకు దూకినట్లు అంతకుముందు అక్కడ ఈత కొడుతున్న యువకులు తెలిపారు.

Updated Date - May 17 , 2024 | 09:41 AM

Advertising
Advertising