ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ABN, Publish Date - May 17 , 2024 | 12:36 AM
చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పరిగి మండలం నస్కల్‌లో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.
పరిగి, మే 16: చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పరిగి మండలం నస్కల్‌లో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. నస్కల్ గ్రామానికి చెందిన ఎండీ ముస్తఫా(38) బుధవారం సాయంత్రం పొలం దగ్గర పనికని ఇంటి నుంచి బయల్దేరి రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో ఆయన కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్పందించకపోవడంతో, తెలిసిన వారిని ఆరాతీసినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో గురువారం ఉదయంలో పొలం దగ్గర చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు చూసి మృతుడి తండ్రి ఎండీ హుస్సేన్‌కు సమాచారం అందించాడు. తన కొడుకు తరచూ మద్యం సేవిస్తుండేవాడని, కొడుకు మృతిపై తనకు ఎవరిపై ఎలాంటి అనుమానాలు లేవని హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పరిగి ఎస్‌ఐ సంతోష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - May 17 , 2024 | 09:35 AM