ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మహిళ మెడలో నుంచి పుస్తెల తాడు చోరీ

ABN, Publish Date - May 12 , 2024 | 12:13 AM

మేడపై నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి పుస్తెల తాడు చోరీచేసిన సంఘటన శనివారం తెల్లవారుజామున సుల్తాన్‌పల్లిలో చోటుచేసుకుంది.

శంషాబాద్‌ రూరల్‌ మే 11 : మేడపై నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి పుస్తెల తాడు చోరీచేసిన సంఘటన శనివారం తెల్లవారుజామున సుల్తాన్‌పల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాటకారి లక్ష్మమ్మ(60) శుక్రవారం రాత్రి ఇంటి మేడపై నిద్రించింది. అయితే దుండగుడు శనివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న లక్ష్మమ్మ మెడలో నుంచి 4 తులాల బంగారు పుస్తెల తాడు లాక్కున్నాడు. దీంతో లక్ష్మమ్మ లేచి దొంగను పట్టుకునే ప్రయత్నం చేసింది. ఆమెను విదిలించుకొని దొంగ పారిపోయా డు. ఆమె కేకలు విన్న చుట్టుపక్కల వారు లేచి వచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకొని సీసీ ఫుటేజీలు పరిశీలించారు. ఇది తెలిసిన వారి పనే అని అనుమానించారు. క్రైం ఎస్సై రాజ్‌కుమార్‌ వివరాలు సేకరించారు. గ్రామస్తులు మేడలపై, వాకిళ్లలో నిద్రిస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Updated Date - May 12 , 2024 | 08:27 AM

Advertising
Advertising