ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

150 గ్రాముల గంజాయి పట్టివేత

ABN, Publish Date - Jul 31 , 2024 | 12:20 AM

మండల కేంద్రం శివారులో 150 గ్రాముల గంజాయిని మంగళవారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు.

కొందుర్గు, జూలై 30: మండల కేంద్రం శివారులో 150 గ్రాముల గంజాయిని మంగళవారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై కృష్ణయ్య కథనం మేరకు.. చిన్నఎల్కిచర్ల, పులుసుమామిడి పంచాయితీ కార్యదర్శులు సాయ్యేల్‌ జాన్‌, ఫయాజ్‌ఖాన్‌, పెట్రోలింగ్‌ పోలీస్‌ సిబ్బంది చందర్‌, జె.వెంకటయ్యలు కలిసి ఉదయం 10.30 గంటలకు మండల కేంద్రం శివారులోని ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా వెంచర్‌ దగ్గర ఎస్సై వాహనాలను తనిఖీ చేస్తున్నారు. షాద్‌నగర్‌ నుంచి స్కూటీపై ఇద్దరు వ్యక్తులు రాగా.. అనుమానం వచ్చి తనిఖీ చేశారు. ఈమేరకు స్కూటీ డిక్కీలో కొన్నిబ్రౌన్‌ కలర్‌ ప్యాకెట్లు కనిపించాయి. వారి వివరాలు అడిగారు. నారాయణపేట జిల్లా పరిధిలోని దన్వాడకు చెందిన భానుప్రకాష్‌ గౌడ్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోని తిమ్మాజీపేట మండలం అప్పాజిపల్లికి చెందిన సాయి ప్రకా్‌షరెడ్డి అని తెలిపారు. ప్యాకెట్లలో గంజాయి ఉందని తెలపడంతో సీజ్‌ చేసినట్లు ఎస్సై చెప్పారు. మొత్తం 5 ప్యాకెట్లలో 155.98 గ్రాములు ఉన్నట్లు తెలిపారు. ఈ విషయమై ఫిర్యాదు చేయగా, నిందితులను అరె్‌స్టచేసి, స్థానిక హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనయ్య కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - Jul 31 , 2024 | 08:20 AM

Advertising
Advertising
<