ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad- విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

ABN, Publish Date - Sep 10 , 2024 | 11:13 PM

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వేలో భాగంగా మంగళవారం తిర్యాణి మండలంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పాఠాలు బోధించారు

: విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

తిర్యాణి, సెప్టెంబరు 10: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వేలో భాగంగా మంగళవారం తిర్యాణి మండలంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పాఠాలు బోధించారు. మధ్యాహ్న భోజనం పరిశీలించారు. మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో విద్యార్థుల ప్రతిభను గుర్తించడానికి జిల్లాలోని ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించనున్నామని తెలిపారు. విద్యార్థుల్లో ప్రతిభను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. నీతి ఆయోగ్‌ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అన్ని గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ మల్లేష్‌, ఎంపీఓ సుదాకర్‌రెడ్డి, ప్రధానోపాధ్యా యుడు అంజయ్య, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:13 PM

Advertising
Advertising