ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pushpak Buses: ఎయిర్‌పోర్ట్‌ డిపార్చర్‌ కారిడార్‌ వరకూ పుష్పక్‌ బస్సులు

ABN, Publish Date - Mar 31 , 2024 | 12:58 PM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని అరైవల్‌ టెర్మినల్‌ వరకు అందుబాటులో ఉన్న ఆర్టీసీ సేవలను డిపార్చర్‌ కారిడార్‌ వరకు పొడిగించినట్లు గ్రేటర్‌ ఈడీ వెంకటేశ్వర్లు(Greater Ed Venkateswarlu) తెలిపారు.

హైదరాబాద్‌ సిటీ: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని అరైవల్‌ టెర్మినల్‌ వరకు అందుబాటులో ఉన్న ఆర్టీసీ సేవలను డిపార్చర్‌ కారిడార్‌ వరకు పొడిగించినట్లు గ్రేటర్‌ ఈడీ వెంకటేశ్వర్లు(Greater Ed Venkateswarlu) తెలిపారు. ఈ మేరకు శనివారం అక్కడి వరకు బస్సులను నడిపారు. పుష్పక్‌ బస్సులో వచ్చే ప్రయాణికులు నేరుగా డిపార్చర్‌ కారిడార్‌లో దిగి సామగ్రితో చెకింగ్‌ కౌంటర్‌లోకి వెళ్లిపోవచ్చని ఈడీ వెల్లడించారు. గ్రేటర్‌లోని పలు ప్రాంతాల నుంచి 5 రూట్లలో 49 పుష్పక్‌ బస్సులు 24 గంటలపాటూ అందుబాటులో ఉండేలా 400 ట్రిప్పులు నడుపుతోంది. పుష్పక్‌ బస్సుల్లో రోజూ 6 వేల మంది ప్రయాణాలు సాగిస్తున్నారని, డిపార్చర్‌ కారిడార్‌ ముందు గేట్‌ నెంబర్‌ 10 వరకు ఆర్టీసీ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు.

5 రూట్లలో 49 బస్సులు..

గ్రేటర్‌ ఆర్టీసీ 5 రూట్లలో 49 ఏసీ ఎలక్ర్టిక్‌ బస్సులను శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు నడుపుతోంది. మియాపూర్‌ ఎక్స్‌రోడ్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు 16 బస్సులు, జేబీఎస్‌ నుంచి 23 బస్సులు, సికింద్రాబాద్‌ నుంచి 6 బస్సులు, 4 ఎలక్ర్టిక్‌ బస్సులను షెటీల్‌ సర్వీస్‌ తరహాలో గచ్చిబౌలి నుంచి వయా ఓఆర్‌ఆర్‌ మీదుగా ఎయిర్‌పోర్ట్‌ వరకు ఆర్టీసీ నడుపుతోంది.

Updated Date - Mar 31 , 2024 | 12:58 PM

Advertising
Advertising