సమస్యలు పరిష్కరించాలి
ABN, Publish Date - Aug 21 , 2024 | 11:31 PM
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మునిసిపల్ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
- నల్లబ్యాడ్జీలు ధరించి మునిసిపల్ కార్మికుల నిరసన
జడ్చర్ల, ఆగస్టు 21 : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మునిసిపల్ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద బుధ వారం మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన, ఆందోళన, ధర్నా కార్యక్రమాలు చేపట్టినా, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా నేటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడం తమకు ఆవేదన కలిగిస్తుందని కార్మికులు వాపోయారు. ఈ కార్యక్రమంలో కార్మికులు మహేష్‌తో పాటు సుమారు 40 మంది కార్మికులు పాల్గొన్నారు.
Updated Date - Aug 21 , 2024 | 11:31 PM