Manchiryāla- నస్పూర్‌కాలనీలో పోచమ్మ బోనాలు
ABN, Publish Date - Jul 21 , 2024 | 10:54 PM
నస్పూర్ కాలనీలోని శ్రీ పోచమ్మ దేవాలయ ఆషాఢ బోనాల జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రెస్ క్లబ్ అవరణ నుంచి కాలనీలోని పురవీధుల గుండా బోనాల ఉరేగింపు డప్పు చప్పుళ్ళ మద్య శివ సత్తుల పూనకాలు విన్యాసాలు, నెత్తిన బోనాలు, భక్తుల కోల హాలంతో ఆలయం వరకు సాగింది.
నస్పూర్, జూలై 21 : నస్పూర్ కాలనీలోని శ్రీ పోచమ్మ దేవాలయ ఆషాఢ బోనాల జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రెస్ క్లబ్ అవరణ నుంచి కాలనీలోని పురవీధుల గుండా బోనాల ఉరేగింపు డప్పు చప్పుళ్ళ మద్య శివ సత్తుల పూనకాలు విన్యాసాలు, నెత్తిన బోనాలు, భక్తుల కోల హాలంతో ఆలయం వరకు సాగింది. చల్లంగా చూడమని పోచమ్మ తల్లి ఆలయంలో ఆమ్మను వేడుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో 23వ వార్డు కౌన్సిలర్ అగల్ డ్యూటీ రాజు, మాజీ ఎంపీటిసీ పెంచాల వేణు, ఆలయ కమిటీ అద్యక్షుడు వేముల సంతోష్, సాధన ఎడ్యూకేషన్ అకాడమీ చైర్మన్ పెంచాల శ్రీధర్, గణపతి ఆలయం అద్యక్షుడు రఘుపతి రావు, లతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - Jul 21 , 2024 | 10:54 PM