ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కరెంట్‌ కోతలతో జనం బేజారు

ABN, Publish Date - Apr 24 , 2024 | 11:37 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత కరెంట్‌ కోతలతో రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరెంట్‌ పోయినప్పుడల్లా ప్రజలకు కేసీఆర్‌ గుర్తుకువస్తున్నారని బీఆర్‌ఎస్‌ నాయ కులు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

- రేపు పాలమూరుకు మాజీ సీఎం కేసీఆర్‌

- విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 24 : కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత కరెంట్‌ కోతలతో రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరెంట్‌ పోయినప్పుడల్లా ప్రజలకు కేసీఆర్‌ గుర్తుకువస్తున్నారని బీఆర్‌ఎస్‌ నాయ కులు అన్నారు. కేసీఆర్‌ పాలనలో కరెంట్‌ కోతల్లేకుండా పరిపాలన అందించా రన్నారు. బుధవారం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీమంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్‌, సి.లక్ష్మారెడ్డి మాట్లాడారు. గ్రా మాలలో ఎక్కడి కెళ్లినా కేసీఆర్‌ పాలనను ప్రజలు గుర్తు చేస్తున్నారని, పొరపా టున ఈ ప్రభుత్వా నికి ఓటు వేసినమని, చాలామంది ఆవేదన చెందుతున్నా రని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కేసీఆర్‌ జిల్లాకు వస్తున్నారని, ఈ సందర్భంగా పాలమూరులో రోడ్‌షో, క్లాక్‌టవర్‌లో జరిగే సమావేశంలో పాల్గొంటారన్నారు. పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి ప్రజలు స్వచ్ఛంధంగా కేసీఆర్‌ పర్యటనకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు రాజేశ్వర్‌గౌడ్‌, ఎంకన్న, శివరాజు, రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:37 PM

Advertising
Advertising