ఓపెన్ కేటగిరీలో నారాయణ హవా
ABN, Publish Date - Apr 26 , 2024 | 04:53 AM
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తమ విద్యార్థులు ఆలిండియా ర్యాంకులు సాధించి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ గురువారం ఓ
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్ ఫలితాల్లో తమ విద్యార్థులు ఆలిండియా ర్యాంకులు సాధించి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓపెన్ కేటగిరిలో తమ విద్యార్థులు ఆలిండియా 1, 5, 6, 7, 8, 10, 12 ర్యాంకులు సాధించారని వివరించారు. 100లోపు ర్యాంకులను 28 మంది, వెయ్యిలోపు ర్యాంకులను 171 మంది సాధించారని పేర్కొన్నారు. జి.నీల్‌కృష్ణ ఆలిండియా మొదటి ర్యాంకు సాధించారని, హెచ్.విదిత్(5), ఎం.అనూప్(6), ఎం.సాయితేజ(7), సీహెచ్ .సతీశ్‌కుమార్(8), ఆర్యన్ ప్రకాశ్(10), పి.రోహన్ సాయి(12) ర్యాంకులతో మెరిసారని తెలిపారు. జేఈఈ మెయిన్‌లో తమ ర్యాంకుల ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది విద్యార్థులు హాజరైన జేఈఈ మెయిన్ పరీక్షలో నారాయణ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో విజయం సాధించారని వివరించారు. అనితర సాధ్యమైన శిక్షణ, రిసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలు, పక్కా ప్రణాళిక, స్టడీ మెటీరియల్, వారాంతపు పరీక్షలతోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. విజయం సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.
Updated Date - Apr 26 , 2024 | 04:53 AM