ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ ఏడాది నుంచే యాదాద్రి మెడికల్‌ కళాశాల

ABN, Publish Date - Jul 29 , 2024 | 12:27 AM

యాదాద్రి (శ్రీలక్ష్మీ నరసింహస్వామి) మెడికల్‌ కళాశాల ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభు త్వం చర్యలు తీసుకుంటోంది. కళాశాలను ప్రారంభించేందుకు కావాల్సిన సిబ్బందిని నియమించింది. అయితే యా దగిరిగుట్టలో శాశ్వత భవన నిర్మాణం కాకపోవడంతో ప్రస్తుతానికి భువనగిరి మండలం పగిడిపల్లి వద్ద ఉన్న పాతకలెక్టరేట్‌ భవనంలో కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు.

ఏర్పాట్లు పూర్తి చేస్తున్న ప్రభుత్వం

50 ఎంబీబీఎస్‌ సీట్లతో ప్రారం భానికి సన్నద్ధం

ఇప్పటికే 49 మంది ప్రొఫెసర్ల నియామకం

పాతకలెక్టరేట్‌ భవనంలో తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు

యాదాద్రి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి (శ్రీలక్ష్మీ నరసింహస్వామి) మెడికల్‌ కళాశాల ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభు త్వం చర్యలు తీసుకుంటోంది. కళాశాలను ప్రారంభించేందుకు కావాల్సిన సిబ్బందిని నియమించింది. అయితే యా దగిరిగుట్టలో శాశ్వత భవన నిర్మాణం కాకపోవడంతో ప్రస్తుతానికి భువనగిరి మండలం పగిడిపల్లి వద్ద ఉన్న పాతకలెక్టరేట్‌ భవనంలో కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. అందుకోసం భవనాన్ని అద్దెకు తీసుకుని మెడికల్‌ కళాశాలకు అనుగుణంగా మరమ్మతులు చేపడుతున్నారు. ప్రస్తుతం 50 ఎంబీబీఎస్‌ సీట్లతో కళాశాల ప్రా రంభం కానుంది. భువనగిరి పట్టణంలో ఉన్న వైద్యవిధాన పరిషత్‌ ఆస్పత్రిని డీఎంఈ పరిధిలోకి మార్చారు. ఈ ఆస్పత్రిలో 220 పడకలుగా ఏర్పాటుచేయనున్నారు. గత ఏడాది జూన్‌ 5న అప్పటి ప్రభుత్వం మెడికల్‌ కళాశాలను మంజూరు చేసింది. కళాశాల భవనాన్ని నిర్మించేందుకు రూ.183కోట్లు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. అయితే యాదగిరిగుట్టలో కళాశాల నిర్మాణ స్థలంపై వివాదం నెలకొనడంతో ఎలాంటి పనులు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో మరోచోట స్థలాన్ని కేటాయించేందుకు అధికారులు నిర్ణయించారు. మరోవైపు కళాశాల ప్రారంభానికి సిబ్బందిని నియమించిన ప్రభుత్వం యాదాద్రి మెడికల్‌ కళాశాల ఏర్పాటుపై నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) నుంచి అనుమతి(లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌) కోసం ఎదురుచూస్తోంది.

సిబ్బంది నియామకం

ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ప్రకారం 50 ఎంబీబీఎస్‌ సీట్లతో ఎంబీబీఎస్‌ కళాశాల ఏర్పాటుకావాలంటే 14 మంది ప్రొఫెసర్లు, 20 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 25 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలి. సుమారు 60మంది నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ ఉండాలి. ప్రభుత్వం ఇప్పటికే 49 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించింది. మాజీ డీఎంఈ రమే్‌షరెడ్డిని యాదాద్రిమెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా, ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా గతంలో గాంధీ ఆసుపత్రికి సూపరింటెండెంట్‌ చేసిన డాక్టర్‌ రాజారావును నియమించింది. పలు కళాశాలల్లో పనిచేసిన ప్రిన్సిపాల్స్‌, ఆస్పత్రుల సూపరింటెండెంట్లను ప్రొఫెసర్లుగా నియమించింది.

తొలగనున్న అడ్డంకులు

యాదాద్రి మెడికల్‌ కళాశాల ఏర్పాటుపై ఎన్‌ఎంసీ బృందం తనిఖీలకు వచ్చినప్పుడు సరైన స దుపాయాలు,స్టాఫ్‌లేనట్టు గుర్తించారు. దీంతో ఈ కళాశాలకు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ప్రభు త్వం ఆగమేఘాల మీద యాదాద్రి మెడికల్‌ కళాశాలను ఈఏడాది నుంచే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంది. ఎన్‌ఎంసీ లేవనెత్తిన లోపాలను 60రోజుల్లో సవరించుకు నే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎన్‌ఎంసీకి అప్పీలుకు వెళ్లారు. కళాశాల అనుమతి పునఃపరిశీలించాలని కోరారు. గతంలో ఫ్యాకల్టీ, స్టాఫ్‌ రిక్రూట్‌మెంట్‌ పూర్తి కాలేదని, ప్రస్తుతం ప్రొఫెసర్లతో పాటు టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ను నియమించామని ఎన్‌ఎంసీకి విన్నవించారు. దీంతో ఈ ఏడాదిలోనే కళాశాల ప్రారంభానికి అనుమతించాలని కోరింది. నీట్‌ షెడ్యూల్‌ ఆధారంగా తరగతులు నడుస్తాయి. ఎన్‌ఎంసీ నుంచి మెడికల్‌ కళాశాల అనుమతులు వచ్చిన వెంటనే తరగతులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ రమే్‌షరెడ్డి వెల్లడించారు.

Updated Date - Jul 29 , 2024 | 12:27 AM

Advertising
Advertising
<