MLA Jagadishareddy: హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
ABN, Publish Date - Sep 10 , 2024 | 12:32 AM
బీఆర్‌ఎస్ బీఫాంపై గెలిచి పార్టీ మారిన ద్రోహులకు చెంపపెట్టుగా హైకోర్టు తీర్పు వచ్చిందని, ఈ తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.
నల్లగొండ, సెప్టెంబరు 9: బీఆర్‌ఎస్ బీఫాంపై గెలిచి పార్టీ మారిన ద్రోహులకు చెంపపెట్టుగా హైకోర్టు తీర్పు వచ్చిందని, ఈ తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మహాకవి కాళోజీ నారాయణరావు జయంతిలో పాల్గొని, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరిగేలా తీర్పు ఉందని, ప్రజా కోర్టులో కూడా ద్రోహులకు, కాం గ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వారిపై అనర్హత వేటు పడ టం ఖాయమని, ఉప ఎన్నికలు వస్తాయన్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు. హైడ్రా పేరుతో రేవంత్‌రెడ్డి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసున్నారని, హైదరాబాద్ అంటేనే భయపడేలా చేస్తున్నారన్నారు. రాజకీయ కక్ష సాధింపులు చేస్తూ హైడ్రామా చేస్తున్నారని, రేవంత్ చర్యలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. బడా బాబుల విషయంలో ఒకలా, పేదల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, రావుల శ్రీనివా్‌సరెడ్డి, మాలే శరణ్యరెడ్డి, బోనగిరి దేవేందర్, కొండూరు సత్యనారాయణ, అభిమన్యు శ్రీనివాస్, కరీంపాషా, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 10 , 2024 | 12:32 AM