వరుణా..కరుణించవా..
ABN, Publish Date - Jul 13 , 2024 | 12:13 AM
సకాలంలో వర్షాలు కురవాలని మండలంలోని పహిల్వానపురం గ్రామ మహిళలు బొడ్రాయికి జలాభిషేకం నిర్వహించారు.
ఆరెగూడెంలో చుట్టుకాముడు ఆడుతున్న మహిళలు
వలిగొండ, జూలై 12: సకాలంలో వర్షాలు కురవాలని మండలంలోని పహిల్వానపురం గ్రామ మహిళలు బొడ్రాయికి జలాభిషేకం నిర్వహించారు. అదునుదాటుతున్నా..వర్షాలు పడకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురవాలని వేడుకున్నారు. మహిళలు బాలమణి, కళమ్మ, సరిత, అంజమ్మ, శంకరమ్మ, అనిత, అలివేలు, వినోద, లక్ష్మమ్మ, రేణుక, లతశ్రీ పాల్గొన్నారు.
ఆరెగూడెంలో చుట్టు కాముడు
మోత్కూరు: వర్షాలు కురియాలని మోత్కూరు మునిసిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామంలో భక్తిశ్రద్ధలతో బిందెల్లో నీళ్లు తెచ్చి వాటిని అలంకరించారు. వాటి చుట్టూ చుట్టుకాముడు ఆడారు.
Updated Date - Jul 13 , 2024 | 12:13 AM