నేడు దివ్యాంగులకు గుర్తింపు శిబిరం
ABN, Publish Date - Sep 10 , 2024 | 12:27 AM
జాతీయ మేధో దివ్యాంగ వ్యక్తుల సాధికారత సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు సంస్థాన నారాయణపురంలోని రాఘవేంద్ర ఫంక్షన హాల్‌లో దివ్యాంగుల గుర్తింపు శిబిరం, ప్రభుత్వ పథకాల అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు ఆ సంస్థ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ జి.శ్రీనివాసులు తెలిపారు.
సంస్థాన నారాయణపురం, సెప్టెంబర్ 9: జాతీయ మేధో దివ్యాంగ వ్యక్తుల సాధికారత సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు సంస్థాన నారాయణపురంలోని రాఘవేంద్ర ఫంక్షన హాల్‌లో దివ్యాంగుల గుర్తింపు శిబిరం, ప్రభుత్వ పథకాల అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు ఆ సంస్థ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ జి.శ్రీనివాసులు తెలిపారు. మండల పరిధిలోని అంగవైకల్యం, అంధత్వం, చెవుడు, తదితర 21 రకాల దివ్యాంగులు ఆధార్ కార్డు, సదరం కార్డు, రెండు ఫొటోలు తీసుకుని ఈ శిబిరంలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ శిబిరంలో దివ్యాంగుల గుర్తింపు కార్డులు, నిరామయ్ ఇన్సూరెన్స కార్డులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమం కోసం అమలు చేసే పథకాలకు ఈ కార్డు ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.
Updated Date - Sep 10 , 2024 | 07:39 AM