ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గురువారం గరంగరం

ABN, Publish Date - Apr 19 , 2024 | 12:06 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లా గురువారం నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో 45.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదుకాగా, వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

మాడ్గులపల్లిలో 45.2డిగ్రీలు

రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ

మాడ్గులపల్లి / నిడమనూరు / వలిగొండ / నేరేడుచర్ల, ఏప్రిల్‌ 18: ఉమ్మడి నల్లగొండ జిల్లా గురువారం నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో 45.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదుకాగా, వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఎండతీవ్రత ఇంకా రెండురోజులు పెరిగే అవకాశం ఉందని సూచించింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని 18 ప్రాంతాల్లో 44డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెద్దవీడులో గరిష్ఠంగా 44.7డిగ్రీలు, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం బిజిలాపూర్‌లో గరిష్ఠంగా 43.4డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతకు రహదారులపై అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఉదయం 8గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండటంతో జనం బయటకు రావడంలేదు. నల్లగొండ జిల్లా నిడమనూరులో ఈ ఏడాది కూడా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతేడాది మేలో నిడమనూరులో రికార్డుస్థాయిలో 49.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఈ నెలలో మూడు పర్యాయాలు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలాఉండగా యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండలో ఓ కూలీ వడదెబ్బతో మృతిచెందాడు. ఆంధ్రప్రదేశ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా శ్రీపారు గ్రామానికి చెందిన అలగంజి నాగరాజు(50) చేపల చెరువులో కూలి పనిచేస్తూ వడదెబ్బకు గురై మృతి చెందాడు. నాగరాజుకు అవివాహితులైన ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి బీసీ బాలికల గురుకుల పాఠశాలలో నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఐదోతరగతి విద్యార్థినులు వాంతులు చేసుకోగా మొదట ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం సాయంత్రం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిండంతో కుదుటపడ్డారు.

Updated Date - Apr 19 , 2024 | 12:06 AM

Advertising
Advertising