ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN, Publish Date - May 26 , 2024 | 12:11 AM

కల్తీ విత్తనాలను రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఏడీఏ దేవ్‌ సింగ్‌ హెచ్చరించారు.

ఆలేరులోని ఎరువుల దుకాణంలో తనిఖీ చేస్తున్న విజిలెన్స బృందం

వలిగొండ/ ఆలేరు రూరల్‌, మే 25: కల్తీ విత్తనాలను రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఏడీఏ దేవ్‌ సింగ్‌ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని పలు విత్తన డీలర్ల దుకాణాలను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన అనంతరం రశీదును తీసుకోవాలని ఆ రశీదు పంట పూర్తి అయ్యే వరకు ఉంచుకోవాలని అన్నారు. అలాగే విత్తన సంచిని గానీ, ప్యాకెట్‌ను గానీ పంట చివరి వరకు ఉంచుకోవాలన్నారు. ఒకవేళ దిగుబడి రానప్పుడు నష్టపరిహారం అందించడానికి వీలవుతుందని తెలిపారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి అంజనీ దేవి సిబ్బంది పాల్గొన్నారు. విత్తనాలను రైతులకు ఎంఆర్‌పీకే విక్రయించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉమ్మడి నల్లగొండ జిల్లా విత్తన విజిలెన్స బృందం సభ్యులు గౌస్‌, రాంబాబులు అన్నారు. శనివారం ఆలేరులోని లక్ష్మీనరసింహ, మన గ్రోమోర్‌ విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో అకసిస్మక తనిఖీ నిర్వహించి రిజిస్ట్రర్లను పరిశీలించారు. తనిఖీల్లో ఏవో దీప్తి, ఏఈవో శివకుమార్‌, దుకాణా యజమానులు రాజేశ్వర్‌ సురేష్‌ ఉన్నారు.

Updated Date - May 26 , 2024 | 12:11 AM

Advertising
Advertising