ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆర్సీవోను సస్పెండ్‌ చేయాలి

ABN, Publish Date - Jul 03 , 2024 | 12:43 AM

గురుకుల పాఠశాలల సమస్యలు పరిష్కరించలేని ఆర్సీవోను సస్పెండ్‌ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మోత్కూరు ఎస్సీ బా లుర గురుకుల పాఠశా ల కార్యాలయం ఎదు ట బైఠాయించి నినాదా లు చేశారు.

గురుకుల పాఠశాల ఎదుట బైఠాయించి విద్యార్థి సంఘాల డిమండ్‌

మోత్కూరు, జూలై 2: గురుకుల పాఠశాలల సమస్యలు పరిష్కరించలేని ఆర్సీవోను సస్పెండ్‌ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మోత్కూరు ఎస్సీ బా లుర గురుకుల పాఠశా ల కార్యాలయం ఎదు ట బైఠాయించి నినాదా లు చేశారు. మోత్కూ రు ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలో ఉడకని అన్నం, నీళ్ల చారుతో విద్యార్థులకు భోజనం పెడుతున్నారని మంగళవారం పత్రికల్లో వచ్చిన వార్తలకు ఆర్సీవో రజని స్పందించారు. పాఠశాలలో ఆర్సీవో విచారణ జరుపుతుండగా, విద్యార్థి సంఘాల నాయకులు అక్కడకు చేరుకుని పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వని వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని, కేర్‌టేకర్‌ ఎందుకు లేరని, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌తో ఎంత కాలం పాఠశాలను నడిపిస్తారని ఆర్సీవోను నిలదీశారు. ఆమె నుంచి సరైన సమాధానాలు రావడం లేదంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహించారు. పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ పాఠశాలకు మంగళవారం ఉదయం పాలు రాలేదని, ఆర్సీవో విచారణ జరుపుతుండగా పాఠశాల వెనుక గోడ పైనుంచి పాలు అందించారన్నారు. ఆర్సీవో వచ్చిన రోజే ఇలా ఉంటే మిగతా రోజుల్లో ఇంకెంత అధ్వానంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆర్సీవో కనుసన్నల్లోనే పాఠశాలలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు మోత్కూరు వచ్చారని తెలిసి విద్యార్థి సంఘాల నాయకులు ఆర్సీవోపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమాల్లో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బుర్ర అనిల్‌కుమార్‌, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పల శాంతికుమార్‌, యూత్‌కాంగ్రె్‌స జిల్లా కార్యదర్శి మందుల సురేష్‌, అవిశెట్టి కిరణ్‌కుమార్‌, తీన్మార్‌ మల్లన్నటీం మండలాల అధ్యక్షులు ముక్కెర్ల భిక్షపతి, మందుల శ్రీకాంత్‌, సింగారం రమేష్‌, చేడె ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఆరోపణల్లో నిజం లేదు : ఆర్సీవో

గురుకుల పాఠశాలలో విచారణ జరిపిన అనంతరం ఆర్సీవో రజని విలేకరులతో మాట్లాడారు. తన కనుసన్నల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్న విద్యార్థి సంఘాల ఆరోపణల్లో నిజం లేదన్నారు. ప్రిన్సిపాల్‌ డిప్యుటేషన్‌పై వెళ్లడంతో వైస్‌ప్రిన్సిపాల్‌ను ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా నియమించామన్నారు. ఈ నెలలో రెగ్యులర్‌ ప్రిన్సిపాల్‌ వస్తారన్నారు. సోమవారం వంట మనుషులు పప్పు మెత్తగా రుబ్బకుండా చారు చేయడంతో అది నీళ్లలా ఉందని, గంజి వార్చకుండా వండటంతో అన్నం సరిగా ఉడకలేదని, వంట మనుషులను మందలించానన్నా రు. మంగళవారం పాఠశాలకు రావాల్సిన విజయ పాలకు బదులు వేరే పాలు వచ్చాయని, అలా ఎందుకు జరిగిందో విచారిస్తానన్నారు. అడ్డగూడూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ రూప, మోత్కూరు ప్రిన్సిపాల్‌ వెంకటస్వామి ఆమె వెంట ఉన్నారు.

Updated Date - Jul 03 , 2024 | 09:45 AM

Advertising
Advertising