ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తండ్రి జానారెడ్డి బాటలోనే రఘువీర్‌రెడ్డి

ABN, Publish Date - Apr 25 , 2024 | 12:41 AM

నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబడుతున్న కుందూరు రఘువీర్‌రెడ్డి తండ్రి జానారెడ్డి, సోదరుడు జైవీర్‌రెడ్డి బాటలోనే నడిచాడు.

సత్యనారాయణస్వామి ఆలయంలో రఘువీర్‌రెడ్డిని ఆశీర్వదిస్తున్న అర్చకుడు

తమ ఇష్టదైవం సత్యనారాయణస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు

నాగార్జునసాగర్‌, ఏప్రిల్‌ 24 : నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబడుతున్న కుందూరు రఘువీర్‌రెడ్డి తండ్రి జానారెడ్డి, సోదరుడు జైవీర్‌రెడ్డి బాటలోనే నడిచాడు. 1985 నుంచి ఎన్నికల సమయంలో నామినేషనకు బయలుదేరే ముందు నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలోని సత్యనారాయణస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొనడం ఆనవాయితీ. అదే పద్ధతిని సాగర్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసిన జైవీర్‌ అనుసరించారు. ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల్లో నిలబడుతున్న రఘువీర్‌రెడ్డి కూడా బుధవారం నామినేషనకు వెళ్లే ముందు సత్యనారాయణస్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతకు ముందు ఇంటి వద్ద తల్లిదండ్రులకు రఘువీర్‌రెడ్డి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకోగా తల్లి సుమతి, భార్య లక్ష్మిలు హారతి ఇచ్చారు. మాజీ మంత్రి కుందూరు జారెడ్డి, ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి, మాజీ జడ్పీ వైస్‌చైర్మన కర్నాటి లింగారెడ్డి, ప్రసాద్‌, రాంబాబు, చంద్రశేఖర్‌రెడ్డి, కిశోర్‌, నందికొండ మునిసిపల్‌ చైర్‌పర్సన అన్నపూర్ణ, రామకృష్ణ, విక్రం, మోహన, జంగయ్య, శ్రీను, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:41 AM

Advertising
Advertising