ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రయాణికులను గమస్థానానికి సురక్షితంగా చేర్చాలి

ABN, Publish Date - Jul 31 , 2024 | 12:13 AM

ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బంది ప్రయాణికులను వారి గమ్యస్థానాల కు సురక్షితంగా చేర్చడం సమాజ సేవగా భావించాలని ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ అన్నారు. మంగళవా రం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో కార్యాలయంలో నిర్వహించిన ప్రమాద రహిత వారోత్సవాల్లో ఆయన మాట్లాడారు.

ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌

సూర్యాపేటఅర్బన్‌, జూలై 30: ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బంది ప్రయాణికులను వారి గమ్యస్థానాల కు సురక్షితంగా చేర్చడం సమాజ సేవగా భావించాలని ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ అన్నారు. మంగళవా రం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో కార్యాలయంలో నిర్వహించిన ప్రమాద రహిత వారోత్సవాల్లో ఆయన మాట్లాడారు. సురక్షితంగా బస్సులను నడిపి అవార్డులు పొందడమేగాక ఆర్టీసీ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లాలని సూచించారు. దేశవ్యాప్తంగా పదేళ్లలో 1.60కోట్ల మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్నారు. హత్యల్లో చోటుచేసుకునే మరణాల కంటే రోడ్డు ప్రమాద రూపంలో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయన్నారు. రోడ్డు ప్రమాద మరణాన్ని తీవ్ర నేరంగా పరిగణించాలన్నారు. డ్రైవర్లు క్రమశిక్షణతో జాగ్రత్తగా బస్సులు నడపాలని సూచించారు. మహిళల కు ఉచితంగా బస్సు ప్రయణాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని దీంతో బస్సు డ్రైవర్లకు బాధ్యత మ రింత పెరిగిందన్నారు. బస్సు నడిపే ముందు డ్రైవర్లు ఆ బస్సు స్థితిగతులను పరిశీలించి ఏదైనా లోపం ఉంటే సరిచేయించుకోవాలన్నారు. అనంతరం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ఏడు డిపోలకు చెందిన 21మంది ప్రమాద రహిత డ్రైవర్లను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ఎంవీఐ జయప్రకా్‌షరెడ్డి, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ రాజశేఖర్‌, డిప్యూటీ రీజనల్‌ మేనేజర్‌ మాధవి, శివశంకర్‌, డిపో మేనేజర్‌ సురేందర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ సైదులు, కృష్ణయ్య, పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 12:13 AM

Advertising
Advertising
<