సాగర్, పులిచింతలలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
ABN, Publish Date - Aug 21 , 2024 | 12:36 AM
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు ఎగువ నుంచి భారీ వరద లేకపోవడంతో క్రస్ట్‌గేట్లను మూసివేసిన అధికారులు జల విద్యుదుత్పత్తిని మాత్రం కొనసాగిస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590అడుగులు (312.0450టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 589.40అడుగులు(310.2522టీఎంసీలు) ఉంది.
పూర్తిస్థాయికి రెండు అడుగుల దూరంలో ‘మూసీ’
నాగార్జునసాగర్/కేతేపల్లి/మేళ్లచెర్వు, ఆగస్టు 20: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు ఎగువ నుంచి భారీ వరద లేకపోవడంతో క్రస్ట్‌గేట్లను మూసివేసిన అధికారులు జల విద్యుదుత్పత్తిని మాత్రం కొనసాగిస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590అడుగులు (312.0450టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 589.40అడుగులు(310.2522టీఎంసీలు) ఉంది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు పూ ర్తి స్థాయి నీటిమట్టం 885అడుగులు (215.8070టీఎంసీలు) కాగా శ్రీశైలానికి ఎగువ నుంచి 78,074 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో మంగళవారం సాయంత్రానికి 881.70అడుగులుగా (197.4617టీఎంసీలు) ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 37,328 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు. సాగర్ నుంచి మొత్తం 46,796 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఎగువనుంచి 37,328 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది.
పూర్తిస్థాయికి రెండు అడుగుల దూరంలో ‘మూసీ’
హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో నిలకడగా కొనసాగుతుండడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు లో నీటినిల్వ 645అడుగుల గరిష్ఠ స్థాయికి చేరువలోఉంది. రెండు రోజులుగా హైదరాబాద్,మూసీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి 1644.31 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులు (4.46టీఎంసీలు) కాగా, మంగళవారం సాయంత్రానికి 643అడుగులకు (3.93టీఎంసీలు)చేరింది.మరోవైపు మూసీ ఆయకట్టులో వానాకాలం పంటల సాగు కోసం కుడి కాల్వకు 166.32క్యూసెక్కులు,ఎడమ కాల్వకు 261.36క్యూసెక్కుల నీటినివిడుదల చే స్తున్నారు.రైతుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని నీటి విడుదలను వారం రోజు ల పాటు పొడిగించినట్లు మూసీ డ్యాం ఏఈఈ ఉదయ్‌కుమార్ తెలిపారు. దీంతో ఈ నెల 26 వరకు ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల కొనసాగనుంది.
పులిచింతలలోనూ జలవిద్యుదుత్పత్తి
ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. కేంద్రంలోని నాలుగు యూనిట్ల ద్వారా 16వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ, 105 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో ఎగువ నుంచి వచ్చిన వరద నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175అడుగులు (45.77 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 174.96 అడుగులుగా (45.71టీఎంసీలు)ఉంది. ఎగువ నుంచి 26,850 క్యూసెక్కులు వస్తుండగా ఒక్క రేడియల్ క్రస్ట్‌గేట్‌ను రెండు మీటర్లు ఎత్తి 17,650 క్యూసెక్కులను నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తంగా 33,650 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.
Updated Date - Aug 21 , 2024 | 12:36 AM