ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జోరుగా జీరోదందా

ABN, Publish Date - Apr 19 , 2024 | 12:03 AM

సూర్యాపేట పట్టణంలో ధాన్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ నుంచి వ్యాపారం చేయడానికి అవసరమైన లైసెన్సులు తీసుకోకుండా యథేచ్ఛగా కొంతమంది జీరో దందాకు తెరతీశారు.

ధాన్యాన్ని పరిశీలిస్తున్న ప్రైవేటు వ్యక్తులు

సూర్యాపేట సిటీ, ఏప్రిల్‌ 18 : సూర్యాపేట పట్టణంలో ధాన్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ నుంచి వ్యాపారం చేయడానికి అవసరమైన లైసెన్సులు తీసుకోకుండా యథేచ్ఛగా కొంతమంది జీరో దందాకు తెరతీశారు. దీంతో వ్యవసాయ మార్కెట్‌కు రావాల్సిన ఒక్క శాతం పన్ను(సెస్‌) పక్కదారి పడుతోంది. ప్రస్తుతం జిల్లాలో ధాన్యం సీజన జోరుగా సాగుతుండటంతో మార్కెట్లకు రావాల్సిన ధాన్యాన్ని కొంతమంది అడ్డుకొని రైస్‌మిల్లర్లతో కుమ్మకై నేరుగా రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లకు ధాన్య వస్తే ఒక్కశాతం పన్ను చేయాల్సి ఉండటంతో ఆ పన్ను నుంచి తప్పించుకోవడం కోసం ప్రైవేటు వ్యక్తులు కొత్త తరహా దందా చేస్తున్నారు.సూర్యాపేట పట్ట ణంలోని కుడుకుడ రోడ్డులో కొంతమంది లైసెన్సలు లేకుండానే ఈ వ్యాపారం చేస్తున్నారు. గ్రామాల్లో కొంతమంది వ్యక్తులను ఏజెంట్లను పెట్టుకొని తక్కువ ధరలకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా వ్యవసాయ మార్కెట్‌ అధికారులు ఇచ్చే ట్రైడ్‌లైసెన్సలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి ట్రైడ్‌ లైసెన్సలు ఏమీ తీసుకోకుండా జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డులో బహిరంగానే వ్యాపారం చేస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారంతో రోజుకు రూ.లక్ష అర్జిస్తున్నారు. ఈ విషయంపై మార్కెట్‌ కార్యదర్శి బీవీ రాహుల్‌ ను వివరణ కోరగా ఇప్పటివరకు లైసెన్సలు లేకుండా వ్యాపారం చేస్తున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. మార్కెట్‌ నుంచి లైసెన్సలు లేకుండా లేకుండా వ్యాపారం చేస్తున్న వ్యక్తు లను తమ సిబ్బందితో గుర్తించి, మార్కెట్‌ నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటానన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:03 AM

Advertising
Advertising